Nayanthara: ఇండస్ట్రీలో 22 ఏళ్ళు.. నన్ను నన్నుగా మార్చాయి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నయనతార
నయనతార.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చంద్రముఖి సినిమాతో(Nayanthara) తెలుగులో పరిచయం అయిన నయన్ తరువాత వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

Nayanthara makes emotional comments on her 22-year journey in the film industry
Nayanthara: నయనతార.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చంద్రముఖి సినిమాతో తెలుగులో పరిచయం అయిన నయన్ తరువాత వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో వర్క్ చేసి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళంలోనే సెటిల్ అయ్యింది. అక్కడ కూడా స్టార్స్ తో నటించే (Nayanthara)అవకాశాన్నీ దక్కించుకుంది. ఈ మద్యే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాలో నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అయితే, తాజాగా నయనతార సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాజాగా ఆమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన 22 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది. “మొదటిసారి కెమెరా ముందు వచ్చి నేటికి 22 ఏళ్లు. సినిమాలే నా ప్రపంచం అవుతాయని ఎప్పుడు అనుకోలేదు. తెలియకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నన్ను మార్చేశాయి, ధైర్యాన్నిచ్చాయి. నన్ను నన్నుగా మార్చాయి. నా ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతిఒక్కరికి రుణపడి ఉంటాను’’ అంటూ నోట్ విడుదల చేసింది. దీంతో ఆమె షేర్ చేసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక నయనతార ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తోంది. “మన శంకర వరప్రసాద్ గారు” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్లా అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్స్ లో ఎక్కడ చూసినా అదే పాట కనబడుతోంది. సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని టీం భావిస్తున్నారు. మరి ఈ సినిమా విజయంతో నయనతార మళ్ళీ తెలుగులో బిజీ అవుతుందా చూడాలి.