Hearty Singh : ఈ అబ్బాయి ఎవరో తెలుసా? అప్పుడు ప్రభాస్ కోసం.. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం..

తాజాగా ఎన్టీఆర్ తో ఓ అబ్బాయి దిగిన ఫోటో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ పిల్లాడు ఎవరా అనుకుంటున్నారా?(Hearty Singh)

Hearty Singh

Hearty Singh : తాజాగా ఎన్టీఆర్ తో ఓ అబ్బాయి క్లోజ్ గా దిగిన ఫోటో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ పిల్లాడు ఎవరా అని అనుకుంటున్నారా? ఇతను ఎవరో కాదు వార్ 2 సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ టీనేజర్ పాత్ర వేసిన చైల్డ్ ఆర్టిస్ట్. సినిమాలో ఇతని పేరు రఘు. ఒరిజినల్ గా ఇతని పేరు హార్టీ సింగ్. తాజాగా హార్టీ సింగ్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

హార్టీ సింగ్ చిన్నప్పట్నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించాడు. దాదాపు 150 యాడ్స్ లో కూడా నటించాడు. అనేక మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్, క్రికెటర్స్ తో కలిసి నటించాడు హార్టీ సింగ్. ఇప్పుడు వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ టీనేజర్ పాత్ర చేసినట్టే కల్కి సినిమాలో కూడా ప్రభాస్ టీనేజర్ పాత్ర ఇతనే చేసాడు. అలా ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరికి చిన్నప్పటి క్యారెక్టర్స్ లో నటించాడు.

Also See : Jabardasth Satya Sri : జబర్దస్త్ సత్యశ్రీ వినాయకచవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..

కల్కి 2 సినిమాలో కూడా ఇతను ఉండే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ, తను నటించిన యాడ్స్, సినిమాల గురించి పోస్ట్ చేస్తూ, సెలబ్రిటీలతో ఫొటోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటాడు.

ఎన్టీఆర్ తో దిగిన ఫోటో షేర్ చేసి హార్టీ సింగ్.. జూనియర్ ఎన్టీఆర్ సర్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ పక్కన నిలబడటం, మీకు సంబంధించిన పాత్రలో నటించడం నాకు పెద్ద విజయం లాంటిది. నేను మీ చిన్నప్పటి పాత్రకు న్యాయం చేశాను అని అనుకుంటున్నాను. మీరు రోల్ మోడల్. మనం సెట్ లో ఎప్పుడూ కలిసినా చాలా బాగుంటారు. నేను బాగా నటించానని, నన్ను స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నట్టు నాకు చెప్పిన మాటలకు ధన్యవాదాలు. మీరు అందర్నీ స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేస్తారు. లవ్ యు ఎన్టీఆర్ సర్ అంటూ రాసుకొచ్చాడు.

ఇక మనోడు పుష్ప గెటప్ లో చేసిన రీల్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా హార్టీ సింగ్ డ్యాన్స్ చేస్తాడు, గిటార్ వాయిస్తాడు, నటిస్తాడు.. ఇలా పలు విద్యల్లో చిన్నపట్నుంచి ప్రావీణ్యం పొందుతున్నాడు. బాలీవుడ్ లో అయితే రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నాడు, మరి ఫ్యూచర్ లో మరిన్ని తెలుగు సినిమాల్లో కూడా కనపడొచ్చేమో.

Also Read : Sundarakanda : ‘సుందరకాండ’ మూవీ రివ్యూ.. బాబోయ్ ట్విస్ట్, లవ్ స్టోరీ మాములుగా లేదుగా..