Hello Meera : సింగిల్ క్యారెక్టర్ తో సస్పెన్స్ గా తెరకెక్కించిన హలో మీరా..

టీజర్, ట్రైలర్స్ తో ఆసక్తి పెంచిన హలో మీరా సినిమా తాజాగా నేడు ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఒకేఒక అమ్మాయి, కేవలం సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కడం విశేషం.

Hello Meera : సింగిల్ క్యారెక్టర్ తో సస్పెన్స్ గా తెరకెక్కించిన హలో మీరా..

Hello Meera movie review Gargeyi Yellapragada done a good job

Updated On : April 21, 2023 / 6:17 AM IST

Hello Meera :  ఇటీవల కాలంలో కొత్త కొత్త కథలతో చాలా సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులని తమ కథలతో మెప్పిస్తున్నాయి. తాజాగా మరో చిన్న సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే ఈ సినిమా ఒకేఒక అమ్మాయి, కేవలం సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కడం విశేషం. ఈ ‘హలో మీరా'(Hello Meera) అనే సినిమాని లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ సినిమాను నిర్మించారు. దర్శకులు బాపు(Bapu) గారి వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన కాకర్ల శ్రీనివాస్(Kakarla Srinivas) ఈ సినిమాని తెరకెక్కించారు. గార్గేయ ఎల్లాప్రగడ మెయిన్ లీడ్ లో మీరాగా నటించింది.

టీజర్, ట్రైలర్స్ తో ఆసక్తి పెంచిన హలో మీరా సినిమా తాజాగా నేడు ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ విషయానికి వస్తే.. రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకున్న ఒక అమ్మాయికి తన మాజీ ప్రియుడి నుంచి ఓ సమస్య ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఆమెను పోలీసులు హైదరాబాద్ రమ్మంటారు. విజయవాడ నుంచి ఆ అమ్మాయి హైదరాబాద్ బయలుదేరడంతో ఆ దారిలో తనకు వచ్చే కాల్స్ ఏంటి? అసలు సమస్య ఏంటి? సడెన్ గా పెళ్లి పనులు వదిలేసి హైదరాబద్ వెళ్లిపోవడంతో ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ అమ్మాయి పెళ్లి జరిగిందా? సమస్య నుంచి బయటపడిందా అనేదే కథాంశం.

Jio Cinema : జియో సినిమా టార్గెట్ ఏంటి? మొన్న 100 సినిమాలు.. నేడు VOOT యాప్ మెర్జింగ్ ప్రకటనలు..

ఒక్క అమ్మాయిని పెట్టి, కేవలం ఫోన్ కాల్స్, ఆ అమ్మాయి ట్రావెలింగ్ తో దాదాపు గంట నలభై నిమిషాల పాటు బోర్ కొట్టకుండా నడిపించడం అన్నది మాములు విషయం కాదు. ఈ విషయంలో చితయునిట్ సక్సెస్ అయ్యారు. సింగిల్ క్యారెక్టర్ తో సినిమా బోర్ కొట్టకుండా డైరెక్టర్ కథని చాలా బాగా నేరేట్ చేశారు. ఇక స్క్రీన్ మీద తనొక్కదే ఉన్నా ప్రేక్షకులని సినిమా అంతా ఎంగేజ్ చేసి, తన నటనతో మెప్పించింది గార్గేయి ఎల్లాప్రగడ. సింగిల్ క్యారెక్టర్ సినిమాలో ఓ పాట కూడా ఉండటం విశేషం. ఆ పాట కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. కొత్త కథలను కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాని కచ్చితంగా చూడాలి.