Jio Cinema : జియో సినిమా టార్గెట్ ఏంటి? మొన్న 100 సినిమాలు.. నేడు VOOT యాప్ మెర్జింగ్ ప్రకటనలు..

తాజాగా జియో స్టూడియోస్ ఓ ఈవెంట్ నిర్వహించి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో దాదాపు 100 సినిమాలు, సిరీస్ లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు, అవి జియో సినిమాలో విడుదల అవుతాయని ప్రకటించారు.

Jio Cinema : జియో సినిమా టార్గెట్ ఏంటి? మొన్న 100 సినిమాలు.. నేడు VOOT యాప్ మెర్జింగ్ ప్రకటనలు..

Voot OTT will merge in Jio Cinema soon

Jio Cinema :  గత కొన్ని రోజులుగా IPL మొదలైన దగ్గర్నుంచి జియో సినిమా(Jio Cinema) పేరు బాగా వినిపిస్తుంది. రిలియన్స్ కు చెందిన వయాకామ్ 18(Viacom 18) సంస్థ ఈ సారి IPL డిజిటల్ హక్కులని ప్రసారం చేసేందుకు ఐదు సంవత్సరాలకు గాను బిడ్ గెలవడంతో జియో సినిమా యాప్ ద్వారా IPL మ్యాచ్ లను ఉచితంగా ప్రసారం చేయనున్నట్టు ప్రకటించి ఇండియాలోని క్రికెట్(Cricjet) అభిమానులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. దీంతో ఎన్నడూ లేని విధంగా జియో సినిమా యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఉచితంగా ప్రసారాలు ఇవ్వడం, అంతేకాక కేవలం జియో సిమ్ ఉన్నవాళ్లకు మాత్రమే కాకుండా అందరికి ఉచితంగా చూపిస్తుండటంతో జియో సినిమా కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయి రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి.

తాజాగా జియో స్టూడియోస్ ఓ ఈవెంట్ నిర్వహించి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో దాదాపు 100 సినిమాలు, సిరీస్ లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు, అవి జియో సినిమాలో విడుదల అవుతాయని ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థలైన అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్.. లాగే జియో సినిమాని కూడా ప్రముఖ ఓటీటీగా మార్చాలనుకుంటున్నట్టు ప్రకటించారు. కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయ్యాక, మరికొన్ని సినిమాలు, సిరీస్ లు డైరెక్ట్ జియో సినిమా యాప్ లోకి త్వరలో రానున్నాయి. అయితే IPL ఫ్రీగా టెలికాస్ట్ చేసినా అన్ని ఓటీటీ యాప్స్ లాగే త్వరలో జియో సినిమాలో కూడా సినిమా కంటెంట్ కి డబ్బులు వసూలు చేయనున్నట్టు ప్రకటించారు.

Ram Charan : ఉపాసన డెలివరీ అయ్యేవరకు చరణ్ షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తాడా??

ఇప్పుడు మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. వయాకామ్ 18 సంస్థకు చెందిన వూట్(Voot) ఓటీటీ యాప్ జియో సినిమాతో మెర్జ్ అవ్వనుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు జియో సినిమా ఓటీటీగా మారుతుండటంతో వూట్ యాప్ ని త్వరలోనే జియో సినిమాలో కలిపేయనున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో త్వరలోనే వూట్ కంటెంట్ కూడా జియో సినిమాలో రానుంది. ప్రస్తుతం వూట్ 299 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తో సంవత్సరమంతా కంటెంట్ అందిస్తుంది. జియో సినిమా కూడా త్వరలో సబ్‌స్క్రిప్షన్ పెడుతామని ప్రకటించడంతో మరి ఆ ఫీజులు ఎలా అంటాయి అని అంత ఆలోచిస్తున్నారు. మొత్తానికి జియో సినిమా ఇండియాలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటిగా మారేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.