Ajith Kumar:హీరో అజిత్ సాహసం, హైదరాబాద్ టు చెన్నై 650కిమీ బైక్ రైడింగ్
తమిళ స్టార్ హీరో అజిత్ పెద్ద సాహసమే చేశాడు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు అంటే 650 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేశాడు. అదీ ఒంటరిగానే. హెచ్ వినోద్ డైరెక్షన్ లో

Ajith Kumar:తమిళ స్టార్ హీరో అజిత్ పెద్ద సాహసమే చేశాడు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు అంటే 650 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేశాడు. అదీ ఒంటరిగానే. హెచ్ వినోద్ డైరెక్షన్ లో
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ పెద్ద సాహసమే చేశాడు తమిళ స్టార్ హీరో అజిత్. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు అంటే 650 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేశాడు. అదీ ఒంటరిగానే. రీసెంట్‌గా చిత్ర బృందం ఈ విషయాన్ని చెప్పడంతో అజిత్ చేసిన రిస్క్ తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి.
ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి మరీ బైక్ పై ప్రయాణం:
హెచ్ వినోద్ డైరెక్షన్ లో ”వాలిమై” సినిమాలో నటిస్తున్నాడు అజిత్. లాక్ డౌన్ కు ముందు సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ షెడ్యూల్‌లో అజిత్‌పై బైక్ చేజింగ్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అజిత్ కోసం ప్రత్యేకంగా బైక్ డిజైన్ చేశాడు. ఇది అజిత్‌కి ఎంతగానో నచ్చింది. ఇంకేముంది షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు దీనిని ఎంచుకున్నాడు అజిత్. చెన్నైకి వెళ్లేందుకు అజిత్‌కి ఫ్లైట్ టికెట్ బుకింగ్ అయినప్పటికీ, దానిని క్యాన్సిల్ చేయించి మరీ ఒంటరిగా చెన్నైకి బైక్‌పై వెళ్లాడు అజిత్.
దారిలో పెట్రోల్, ఫుడ్ కోసం మాత్రమే ఆగాడు:
హైదరాబాద్ నుంచి చెన్నైకి 650 కిలోమీటర్లు. ఈ 650 కిలోమీటర్ల ప్రయాణంలో కేవలం పెట్రోల్, ఫుడ్ కోసమే మధ్యలో ఆగినట్టు అజిత్ యూనిట్ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇవి వైరల్ అయ్యాయి. కాగా, లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. సినిమాను నవంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టం:
అజిత్ కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అనేక బైక్ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు. ఆ మక్కువే ఇప్పుడు అజిత్ తో హైదరాబాద్ నుంచి చెన్నైకు బైక్ పై వెళ్లేలా చేసిందట. వాలిమై సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అజిత్ నటిస్తున్నాడు. వాలిమై సినిమాకు హెచ్ వినోద్ డైరెక్టర్, బోనీ కపూర్ నిర్మాత. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్. అజిత్ సరసన బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ కథానాయికగా నటిస్తుంది.