×
Ad

Naga Chaitanya: తాతయ్యలా వేరేవాళ్లు చేయడం ఏంటి.. నాకది నచ్చలేదు.. తప్పించుకు తిరిగినా కూడా వదల్లేదు..

అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వల్ల తాత నాగేశ్వరరావు లాగా వేరేవాళ్లు చేయడం తనకు నచ్చలేదట. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Hero Naga Chaitanya made interesting comments about acting like Akkineni Nageswara Rao

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వల్ల తాత నాగేశ్వరరావు లాగా వేరేవాళ్లు చేయడం తనకు నచ్చలేదట. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆయన టాలీవుడ్ సీనియర్ (Naga Chaitanya)హీరో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి హాజరయ్యాడు. ఈ షోలో ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి, సినిమాల గురించి చాలా విషయాలను చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే మహానటి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించడం గురించి చెప్పాడు.

OG: ఓజీ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్.. అక్షరాలా 48 లక్షలు.. ఇది కదా పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే!

“ముందు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘మహానటి’లో తాతయ్య పాత్ర చేయాలని చెప్పగానే షాకయ్యా. తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించా. ఎందుకంటే, ఆయనలా నటించడం అనేది మరొకరికి సాధ్యం కాదు. అందుకే నావల్ల కాదు.. అది అసాధ్యం. మర్చిపోండి అని నాగ్‌ అశ్విన్‌కి. అదే సమయంలో వేరే సినిమా కోసం గెడ్డం కూడా పెంచాను. ఆ కారణం చెప్పి కూడా తప్పించుకోవాలి అనుకున్నాను. కానీ, నాగ్ అశ్విన్ గ్రాఫిక్స్ లో గెడ్డం తీసేస్తాం.. ఈ క్యారెక్టర్‌లో నువ్వు మాత్రమే నటించాలి అని పట్టుబట్టాడు.

తర్వాత బాగా ఆలోచిస్తే ఒక విషయం అర్థమైంది. నేను ఆ పాత్ర చేయకపోతే వేరే నటుడు చేస్తాడు. అది నా మనసు అంగీకరించలేదు. అసలు నేనుండగా ఆ పాత్ర మరొకరు చేయడం ఏంటి? అని అనిపించింది. అప్పుడే ఈ పాత్ర తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నా”అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. ఆలాగే ఆయనలా నటించడం నాకు దక్కిన అదృష్టమని, ఆయనపై నా ప్రేమను చూపించడానికి నాకు దక్కిన ఒక గొప్ప అవకాశమని చెప్పాడు” దీంతో నాగ చైతన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మతో ఓ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.