OG: ఓజీ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్.. అక్షరాలా 48 లక్షలు.. ఇది కదా పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే!
బాక్సాఫీస్ దగ్గర ఓజీ ఊచకోత అస్సలు తగ్గడం లేదు. విడుదలై పదిరోజులు గడుస్తున్నా (OG)ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొదటిరోజు ఏకంగా రూ.154 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

48 lakh OG movie tickets sold on Book My Show and District apps combined
OG: బాక్సాఫీస్ దగ్గర ఓజీ ఊచకోత అస్సలు తగ్గడం లేదు. విడుదలై పదిరోజులు గడుస్తున్నా ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొదటిరోజు ఏకంగా రూ.154 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే దాదాపు అన్నిచోట్లా బ్రేక్ ఈవెన్ కూడా సాదించినట్టుగా సమాచారం. ఈ మధ్య కాలంలో విడుదలైన భారీ సినిమాల్లో ఇంత తొందరగా(OG) బ్రేకీవెన్ సాధించిన సినిమాగా కూడా ఓజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అసలు పవన్ కళ్యాణ్ సరైన కంటెంట్ తో వస్తే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది ఓజీ.
ఇందులో భాగంగానే, తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో రికార్డ్ క్రియేట్ అయ్యింది. అదేంటంటే, ప్రేక్షకులు టికెట్ బుక్ చేసుకోవడానికి ఎక్కువగా బుక్ మై షోని ఉపయోగిస్తారు. కానీ ఈమధ్య కాలంలో దానికి పోటీగా డిస్ట్రిక్ట్ అనే యాప్ కూడా వచ్చింది. ఈ రెండు యాప్ లలో ఓజీ టికెట్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరిగాయి. ఓజీ సినిమాకి బుక్ మై షోలో 27 లక్షల టిక్కెట్లు, డిస్ట్రిక్ట్ యాప్ లో 21 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ రెండు యాప్ లలో కలిపి మొత్తం 48 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడవ్వడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదే కూడా కేవలం తెలుగు వెర్షన్ తోనే. ఇది మాములు రికార్డ్ కాదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
ఒకవేళ ఈ సినిమాని హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసి ఉంటె ఈ లెక్కలు డబుల్ ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక దీపావళి పండుగ వరకు ఈ సినిమాకి థియేట్రికల్ రన్ ఉంటుంది. కాబట్టి, కేవలం బుక్ మై షో యాప్ లోనే 30 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే, గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కించాడు. తమన్ మ్యూజిక్ అందించగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన నేపధ్యంలో ఓజీ ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.