Naga Shaurya : నాగశౌర్య దంపతుల ఫస్ట్ యానివర్సరీ.. లవ్లీ వీడియో చూసారా?

హీరో నాగశౌర్య దంపతులు మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వీరిద్దరి సెలబ్రేషన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Naga Shaurya

Naga Shaurya : హీరో నాగశౌర్య దంపతుల ఫస్ట్ యానివర్సరీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. క్యూట్ వీడియో చూసి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Karthika Nair : కార్తీక నాయర్ మరిన్ని పెళ్లి ఫొటోలు..

హీరో నాగశౌర్య, తన గర్ల్ ఫ్రెండ్ అనూషను పెళ్లాడి ఏడాది అయిపోయింది. నవంబర్ 20, 2022 న ఈ జంట ఒక్కటయ్యారు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో వీరి పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. అప్పుడే వీరి పెళ్లై ఏడాది అయిపోయింది.  నాగశౌర్య దంపతులు ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాగశౌర్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

Shah Rukh Khan : షారుఖ్ పిల్లలతో రణవీర్-దీపికల లవ్లీ వీడియో చూశారా..?

నాగశౌర్య దంపతుల క్యూట్ వీడియో చూసి నెటిజన్లు శుభాకాంక్షలు చెప్పారు. అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా? అంటూ కామెంట్లు పెట్టారు. 2023 లో నాగశౌర్య నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, రంగబలి సినిమాలు విడుదలై ఫర్వాలేదనిపించాయి. పోలీసువారి హెచ్చరిక సినిమా విడుదల కావాల్సి ఉంది.