Shah Rukh Khan : షారుఖ్ పిల్లలతో రణవీర్-దీపికల లవ్లీ వీడియో చూశారా..?
నిన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో షారుఖ్ పిల్లలతో కలిసి ఉన్న రణవీర్-దీపికల లవ్లీ వీడియో చూశారా..?

Ranveer Singh Deepika Padukone lovely moments with Shah Rukh Khan kids
Ranveer Singh – Deepika Padukone : నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ లో టాలీవుడ్ టు బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. పలువురు స్టార్స్ కుటుంబంతో సహా వచ్చి ఆ ప్రతిష్టాత్మక మ్యాచ్ ని ప్రత్యేక్షంగా వీక్షించారు. షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ, రణవీర్, దీపిక పదుకొనె దంపతులు, మహేష్ బాబు ఫ్యామిలీ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో అభిమానుల మధ్య కూర్చొని మ్యాచ్ ని వీక్షించారు. ఇక ఒకే చోట క్రీడా, సినీ రంగం సెలబ్రిటీస్ కనిపించడంతో అభిమానులకు కన్నుల పండుగ అయ్యింది.
మ్యాచ్ లో తమ ఫేవరెట్ స్టార్స్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈక్రమంలోనే షారుఖ్, రణవీర్ ఫ్యాన్స్ ఒక లవ్లీ వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో రణవీర్ అండ్ దీపికా షారుఖ్ పిల్లలను ముద్దాడుతూ కనిపిస్తున్నారు. షారుఖ్ చిన్న కొడుకు అబ్రామ్ పై రణవీర్ అండ్ దీపికా ముద్దులు వర్షం కురిపిస్తూ కనిపించారు. అలాగే షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కూడా పక్కన ఉండడంతో ఆమెను కూడా ప్రేమగా పలకరించారు. ఇక ఈ వీడియోని లవ్లీ మూమెంట్స్ అంటూ ఇరువురి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Also read : World Cup 2023 : వరల్డ్ కప్ ఓడిపోవడంతో.. టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎమోషనల్ ట్వీట్స్..
View this post on Instagram
ఇక షారుఖ్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ‘డంకీ’ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. 3 ఇడియట్స్, PK, సంజు వంటి సినిమాలు తెరకెక్కించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 21న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. తాప్సీ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ చేస్తుంది. ఇంగ్లాండ్ వెళ్లడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్న ఒక ఐదుగురు యంగ్ స్టార్స్ లైఫ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అధికార వీసా రాని వారు అక్రమంగా ఇంగ్లాండ్ బయలుదేరి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది సినిమా కథ.