Nandamuri Kalyan Ram : సినీ హీరో నందమూరి కల్యాణ్ రామ్ నరసరావుపేటలో సందడి చేశారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి తొలి పాట విడుదల చేశారు నందమూరి కల్యాణ్ రామ్. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రేక్షకులకు ఉగాది, రంజాన్ శుభాకాక్షలు తెలిపారు కల్యాణ్ రామ్. పల్నాడు జిల్లాలో తొలి సాంగ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారాయన.
Also Read : రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేసిన ప్రదీప్.. షోలు కూడా చేయకుండా.. రెండేళ్లు ఫైనాన్షియల్ కష్టాలు..
పటాస్ సినిమా తర్వాత మొదటిసారి బయటికి వచ్చానని తెలిపారు. మీ సందడి చూస్తుంటే సినిమా సక్సెస్ మీట్ లా ఉందన్నారు. నా అతనొక్కడే సినిమా ఎలా అయితే పెద్ద హిట్ అయ్యిందో.. ఈ అర్జున్ s/o వైజయంతి సినిమా కుడా 20 సంవత్సరాలు గుర్తుండి పోతుందని కల్యాణ్ రామ్ అన్నారు. విజయశాంతి ఈ సినిమాలో నా తల్లి పాత్ర పోషిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మిమ్మల్ని ఇంత బాధ్యతగా పెంచిన మీ అమ్మల పుట్టిన రోజును గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ అర్జున్ s/o వైజయంతి సినిమా తల్లులకు అంకితం అన్నారు కల్యాణ్ రామ్.