Pradeep : రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేసిన ప్రదీప్.. షోలు కూడా చేయకుండా.. రెండేళ్లు ఫైనాన్షియల్ కష్టాలు..
ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రదీప్ ఆసక్తికర విషయం తెలిపాడు.

Anchor Pradeep Didn't Take Remuneration for Akkada Ammayi Ikkada Abbayi Movie
Pradeep : యాంకర్ ప్రదీప్ ఓ పదేళ్ల పాటు టీవీలో స్టార్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించాడు. అనేక టీవీ షోలతో అలరించాడు. అప్పుడప్పుడు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన ప్రదీప్ హీరోగా మారి సినిమాలు కూడా చేస్తున్నాడు ఇప్పుడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ ఇప్పుడు తన రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో రాబోతున్నాడు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. నేడు ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రదీప్ ఆసక్తికర విషయం తెలిపాడు.
Also Read : Sardar 2 : ‘సర్దార్’ తిరిగొచ్చాడు.. సర్దార్ 2 గ్లింప్స్ రిలీజ్.. ఈసారి చైనాలో..
ప్రదీప్ మాట్లాడుతూ.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రెమ్యునరేషన్ లేకుండానే చేశాను. ఈ సినిమాకు నా చిన్నప్పటి ఫ్రెండ్స్ నలుగురు నిర్మాతలుగా మారారు. నేను కూడా కొంత డబ్బు పెట్టాను. అందుకే రెమ్యునరేషన్ తీసుకోలేదు. సినిమా రిలీజయి ప్రాఫిట్స్ వస్తే అందులో ఎంతో కొంత తీసుకుంటాను. గత రెండేళ్లుగా షోలు కూడా రెగ్యులర్ గా చెయ్యట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొద్దిగా వచ్చాయి కానీ మేనేజ్ చేశాను అని తెలిపాడు. మరి ఈ సినిమా రిజల్ట్ తర్వాత మళ్ళీ హీరోగా కంటిన్యూ అవుతాడా, టీవీ షోలు చేస్తాడా చూడాలి.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ ఇక్కడ చూసేయండి..