Sardar 2 : ‘సర్దార్’ తిరిగొచ్చాడు.. సర్దార్ 2 గ్లింప్స్ రిలీజ్.. ఈసారి చైనాలో..

మీరు కూడా సర్దార్ 2 గ్లింప్స్ చూసేయండి..

Sardar 2 : ‘సర్దార్’ తిరిగొచ్చాడు.. సర్దార్ 2 గ్లింప్స్ రిలీజ్.. ఈసారి చైనాలో..

Karthi SJ Suryah Sardar 2 Movie Glimpse Released

Updated On : March 31, 2025 / 7:25 PM IST

Sardar 2 : తమిళ్ స్టార్ హీరో కార్తీ డ్యూయల్ రోల్ లో రాశిఖన్నా, రజీషా హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘సర్దార్’. ps మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. స్పై సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ సినిమా అందర్నీ మెప్పించింది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు. ఇటీవలే సీక్వెల్ షూటింగ్ పూర్తయిందని సమాచారం.

Also Read : Bellamkonda Ganesh : హైదరాబాద్ లో అందరికంటే ఫస్ట్ ఆ మోడల్ కార్ కొన్న హీరో.. ఫొటోలు వైరల్..

తాజాగా సర్దార్ 2 గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో సర్దార్ ఈ సారి చైనాకి వెళ్లినట్టు చూపించారు. అలాగే ఇందులో విలన్ గా SJ సూర్య కనిపించబోతున్నాడు. ఇందులో కూడా తండ్రీకొడుకులు రెండు పాత్రల్లోనూ కార్తీ కనిపించబోతున్నాడు. ఈ గ్లింప్స్ మాత్రం అదిరింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వైరల్ అవుతుంది. ఇది చూసాక సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

మీరు కూడా సర్దార్ 2 గ్లింప్స్ చూసేయండి..

ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గతంలో సర్దార్ తెలుగు, తమిళ్ లో మాత్రమే రిలీజవ్వగా ఈ సారి సీక్వెల్ మాత్రం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వనుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.