Nani Introducing So Many Directors Actors Creates New Film Industry
Nani : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి ఎదిగిన అతి తక్కువమందిలో నాని ఒకరు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారి ఇప్పుడు స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరో పక్క నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. నానికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. గత నాలుగైదు రోజులుగా సినీ పరిశ్రమ, ప్రేక్షకులు అందరూ నాని పై అభినందనలు కురిపిస్తున్నారు.
నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో కొత్త డైరెక్టర్ రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రియదర్శి మెయిన్ లీడ్ గా తెరకెక్కిన కోర్ట్ సినిమా ఇటీవల రిలీజయి పెద్ద హిట్ కొట్టింది. చిన్న సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో ఒకప్పటి హీరో శివాజీ రీ ఎంట్రీ కూడా అదిరింది. నాని ఎప్పటికప్పుడు కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆర్టిస్టులని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కోర్ట్ సినిమా టీమ్ ప్రమోషన్స్ లో, సక్సెస్ మీట్స్ లో నాని ని పొగిడిన విధానం చూస్తే వాళ్లందరికీ నాని ఎంత సపోర్ట్ చేసాడో తెలుస్తుంది.
ఇప్పుడు నాని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. సపరేట్ గా ఒక ఫిలిం ఇండస్ట్రీనే సృష్టిస్తున్నాడు అంటున్నారు. నాని ఫిలిం ఇండస్ట్రీ అని చాలా మందికి అవకాశాలు ఇస్తున్నాడు అంటున్నారు. నాని హీరోగా చాలా మంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చాడు. నాని కెరీర్ లో హీరోగా స్నేహితుడా సినిమాతో డైరెక్టర్ బెల్లంకొండ సత్యం, భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో తాతినేని సత్య, అలా మొదలైంది సినిమాతో నందిని రెడ్డి, సెగ సినిమాతో అంజనా అలీ ఖాన్, ఆహా కళ్యాణం సినిమాతో గోకుల్ కృష్ణ, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగ్ అశ్విన్, నిన్ను కోరి సినిమాతో శివ నిర్వాణ, దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల, హాయ్ నాన్న సినిమాతో శౌర్యువ్ లను దర్శకులుగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసాడు.
ఇక నాని నిర్మాతగా అ సినిమాతో ప్రశాంత్ శర్మ, హిట్ సినిమాతో శైలేష్ కొలను, మీట్ క్యూట్ సినిమాతో తన అక్క దీప్తి, కోర్ట్ సినిమాతో రామ్ జగదీశ్ లను దర్శకులుగా పరిచయం చేసాడు. నాని దర్శకులుగా పరిచయం చేసినవాళ్లు చాలా మంది ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ సినిమాలతో ఎంతోమంది కొత్త నటీనటులను కూడా పరిచయం చేసాడు.
Also See : Deepika Rangaraju : అరుణాచలంలో బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు.. ఫొటోలు..
నానితో సినిమా చేసిన దర్శకులు తనకు బాగా నచ్చితే వాళ్లకు ఇంకో సినిమా ఇస్తాడు, వాళ్ళని తన ఫ్యామిలీగా చూసుకుంటాడు. ఆ డైరెక్టర్స్ నానిని సొంత అన్నయ్య అనుకుంటారు. శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, శ్రీకాంత్ ఓదెల.. లాంటి డైరెక్టర్స్ కి లైఫ్ ఇవ్వడమే కాక వాళ్లకు ఇంకో సినిమా ఆఫర్స్ కూడా ఇచ్చాడు. ఇలా ఇంతమందికి ఆఫర్స్ ఇస్తూ ఇంకా కొత్త వాళ్ళని త్వరలో పరిచయం చేయబోతు నాని హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు.
నాని హీరోగా కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, కంటెంట్ సినిమాలు చేస్తాడు. నిర్మాతగా మాత్రం కంటెంట్ మెయిన్ ఆ తర్వాతే కమర్షియల్ అంటాడు. నాని స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందని వేరే హీరోలే చెప్తారు. నిర్మాతగా కూడా 100 శాతం సక్సెస్ ఉంది నానికి. ఇలా ఇంతమందిని పరిచయం చేస్తూ, వాళ్ళ కెరీర్ కి ఇంకా సపోర్ట్ చేస్తూ, మరికొంతమందిని పరిచయం చేయబోతు నాని సపరేట్ గా ఓ ఫిలిం ఇండస్ట్రీనే నడిపిస్తున్నాడు అనేలా ఎదుగుతున్నాడు.
గతంలో టక్ జగదీశ్ సినిమా ఈవెంట్లో తన సినిమాలు, పరిచయం చేస్తున్న దర్శకులు, తన రాబోయే సినిమాల గురించి, ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. మీరు గర్వపడేలా కష్టపడుతూనే ఉంటాను అని ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు నన్ను చూసేవాళ్లకు ఇప్పుడు నేను పేర్చే ఒక్కో ఇటుక మాత్రమే కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత దూరం నుంచి చూస్తే ఒక గోడ, సాలిడ్ గోడ కనిపిస్తుంది. బుల్డోజర్లు వచ్చినా పగలగొట్టలేని గోడ తయారు చేస్తున్నాను అని అన్నారు. నాని గతంలో ఓ ఈవెంట్లో నేను సినిమాల్లో సంపాదించిన డబ్బులు సినిమాల్లోనే పెడతాను. అందుకే నిర్మాతగా మారాను అన్నాడు. హీరోలు, నటీనటులు అందరూ వేరే బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతుంటే నాని మాత్రం తను సంపాదించినా డబ్బులు బయట ఎక్కడా కాకుండా మళ్ళీ సినిమాల్లోనే నిర్మాతగా పెడుతున్నాడు.
ఇటీవల కోర్ట్ సినిమా ఈవెంట్లో తాను పరిచయం చేసిన దర్శకులు రావడం, అందరూ నాని గురించి మాట్లాడటంతో నాని కి ఇంత సినిమా పిచ్చి ఏంటి భయ్యా, వీళ్లంతా నాని సంపాదించుకున్న ఆస్తి కదా అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అంటే కమర్షియల్ మాత్రమే కాదు కంటెంట్ కూడా అని నాని ప్రూవ్ చేస్తున్నాడు అంటున్నారు.
ఇక సినీ పరిశ్రమలో నాని అందరితో బాగుంటారు. అందరిని పలకరిస్తారు, అందరితో మంచిగా మాట్లాడతారు. దీంతో పరిశ్రమలో కూడా అందరూ నాని గురించి పాజిటివ్ గా చెప్తారు. మంచి మనిషిగా, హీరోగా, నిర్మాతగా నాని ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చిరంజీవిపై అభిమానంతో సినిమాల్లోకి వచ్చిన నాని ఇపుడు చిరంజీవి సినిమాకే నిర్మాతగా మారాడు అంటే ఏ రేంజ్ లో ఎదిగాడో అర్ధం చేసుకోవచ్చు.