Pradeep : యాంకర్ ప్రదీప్ రెండో సినిమా వచ్చేస్తుంది.. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..
కొన్ని రోజుల క్రితం ప్రదీప్ హీరోగా తన రెండో సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ని ప్రకటించాడు.

Anchor Pradeep Machiraju Second Film Akkada Ammayi Ikkada Abbayi Release Date Announced
Pradeep : యాంకర్ గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు కొన్నాళ్ల క్రితం హీరోగా మారాడు. ప్రదీప్ హీరోగా మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా పర్వాలేదనిపించింది. హీరో అయ్యాక యాంకర్ గా టీవీ షోలు ఆపేసాడు ప్రదీప్. దీంతో ప్రదీప్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. కొన్ని రోజుల క్రితం ప్రదీప్ హీరోగా తన రెండో సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ని ప్రకటించాడు.
ప్రదీప్, దీపికా పిల్లి జంటగా మాజీ జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ – భరత్ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ అవ్వగా తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.
Also See : Deepika Rangaraju : అరుణాచలంలో బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు.. ఫొటోలు..
ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్. విలేజ్ కామెడీ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాతో ప్రదీప్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.