Hero Nani : థర్డ్ వేవ్ అపోహలు.. డాక్టర్ తో హీరో నాని చర్చ – వీడియో

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వంతో పాటు సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. కొందరు పేదలకు సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటుంటే మరికొందరు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Hero Nani : థర్డ్ వేవ్ అపోహలు.. డాక్టర్ తో హీరో నాని చర్చ – వీడియో

Hero Nani

Updated On : July 4, 2021 / 12:55 PM IST

Hero Nani : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వంతో పాటు సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. కొందరు పేదలకు సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటుంటే మరికొందరు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా సమయంలో అనేక మంది సెలబ్రిటీలు డాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. ఇక తాజాగా నేచురల్ స్టార్ నాని క‌రోనా పోరాటం విష‌యంలో డాక్ట‌ర్‌తో చర్చ జ‌రిపారు.

థర్డ్ వేవ్ పై జరుగుతున్న ప్రచారం గురించి ప్రముఖ వైద్యురాలు శివరంజని సంతోష్‌తో నాని చర్చ జరిపారు. ఇందులో కరోనా బారి నుంచి పిల్లల్ని ఎలా రక్షించుకోవాలనే విషయంపై శివరంజని తన సలహా సూచనలు ఇచ్చారు.

థర్డ్ వేవ్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది.

థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని మొదట ప్రచారం జరిగింది. దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి.. AIIMS అధ్యయనంలో ‘వైరస్‌ ఇప్పటిలాగే ఉంటే గతంలో ఉన్న ప్రభావం మాత్రమే ఉండే అవకాశం ఉందని తేలిందని డా. శివరంజని సంతోష్‌ తెలిపారు. కరోనా సోకిన వందమందితో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఆసుపత్రిలో చేరుతున్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించారు. టీకాలు తీసుకోవాలని సూచించారు. కరోనా తగ్గిపోయింది అని మాస్కులు లేకుండా బయట తిరగడం మంచిది కాదని సూచించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్క్ పెట్టకుండా ఇంటోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలి.. వారికి పౌష్ఠిక ఆహారం ఇవ్వాలని తెలిపారు.

పిల్లలకు జ్వరం వస్తే

చిన్నారులకు జ్వరం వచ్చి కళ్లు తెలిస్తే.. తాళం చేతులు, పెట్టడం, నీరు చల్లడం, కొట్టడం, ఎగరవేయడం వంటివి చేయకూడదని ఆమె తెలిపారు. జ్వరం వచ్చిన సమయంలో పిట్స్ రావడం కామన్ అని ఒకటి రెండు నిమిషాల్లో వాళ్ళు కోలుకుంటారని డాక్టర్ శివరంజని సంతోష్‌ వివరించారు. తల్లిదండ్రులు ఆందోళన చెంది పైన చెప్పినవి చేస్తే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురుకుంటారని వివరించారు. పిట్స్ లాంటివి వచ్చినప్పుడు పక్కకు తిప్పి పాడుకోబెట్టాలని ఆమె సూచించారు.

 

 

see this