సీఎం కేసీఆర్‌ను కలిసిన నితిన్
సీఎం కేసీఆర్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి తాను ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును అందచేసిన యంగ్ హీరో నితిన్..

సీఎం కేసీఆర్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి తాను ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును అందచేసిన యంగ్ హీరో నితిన్..
కరోనా వైరస్ ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగులు ఆపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా మార్చి 31వరకు షూటింగ్స్ ఆపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలో వివిధ శాఖలలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవడానికి పలువురు నటీనటులు ముందుకు వస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో తన వంతు భాగస్వామ్యం అందించాలని హీరో నితిన్ నిర్ణయించుకున్నారు. కరోనా కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ప్రశంసించిన ఆయన, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను కలిసి సీఎం సహాయనిధికి 10 లక్షల చెక్ అందించారు నితిన్. కేసీఆర్, నితిన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాసేపు వీరివురు ముచ్చటించుకున్నారు. మార్చి 31వ తేదీ వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలనీ, అందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో పాలు పంచుకోవాలని నితిన్ విజ్ఞప్తి చేశారు.
Read Also : కాలు మీద కాలేసుకుని దేశానికి సేవ చేయండి.. వాళ్లిద్దరి మాటా వినాల్సిందే.. వేరే దారిలేదు..