Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మెగా హీరోగా ఇప్పటికే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవలే విరూపాక్ష సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనుకున్నాడు ఈ హీరో. హారర్ అండ్ థ్రిల్లర్ (Sai Durga Tej)కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ వర్మ తెరకెక్కించాడు. సస్పెన్స్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత సాయి దుర్గ తేజ్ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేశాడు. కానీ, ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు.
ఇదిలా ఉంటే, తాజాగా హీరో సాయి దుర్గ తేజ్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2025లో మోస్ట్ డిజైరెబుల్ పర్సన్ గా అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డును తన అమ్మ దుర్గతో పాటుగా అందుకున్నాడు సాయి దుర్గ తేజ్. ఈ ఫొటోతో పాటు తాను మొదటిసారిగా తన అమ్మతో పటు అందుకున్న అవార్డు ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు ఈ హీరో. ఆ ఫోటోల గురించి వివరిస్తూ.. మొదటిది నేను జీవితంలో అందుకున్న మొదటి అవార్డు, రెండవది న సెకండ్ లైఫ్ నేను అందుకున్న మొదటి ఫోటో. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నీకు కొడుకుగా పుట్టాను”అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
సెకండ్ లైఫ్ అంటే, సాయి దుర్గ తేజ్ కి ఆమధ్య బైక్ ఆక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయి దుర్గ తేజ్ మరణం అంచులదాకా వెళ్లి వచ్చాడు. ఒక రకంగా ఆయనకిది పునర్జన్మ అనే చెప్పాలి. అందుకే, ఈ జీవితాన్ని ఆయన సెకండ్ లైఫ్ గా చెప్పుకొన్నాడు. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
FIRST PIC:- My first award in my first life is taken by AMMA
SECOND PIC:- My first award in my second life is taken by AMMA
En janmalo punyam chesukunano Telidhu Neeku kodukku ga putanu AMMA ❤️ pic.twitter.com/iNDgk6ZNeq
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 13, 2025