Rashmika Mandanna: రష్మిక బ్యాడ్ లక్.. ఆ క్రేజీ ప్రాజెక్టు నుంచి తీసేశారు.. మరి ఎవరు చేస్తున్నారో తెలుసా..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరో క్రేజీ మూవీ నుంచి తప్పుకుంది. (Rashmika Mandanna)శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న ఓ సినిమా నుంచి ఆమెను తొలగించారు మేకర్స్.
makers cast sreeleela in rashmika place for sivakarthikeyan film
Rashmika Mandanna: తమిళ స్టార్ శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ఈ హీరోకి తమిళ్ లో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా అదే రేంజ్ లో మార్కెట్ ఉంది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మంచి అంచనాలు క్రియేట్ అవుతాయి.(Rashmika Mandanna) కెరీర్ బిగినింగ్ లో వరుస సూపర్ హిట్స్ అందుకున్న ఈ నటుడు ఈ మధ్య కాస్త వెనుకబడిపోయాడు. రీసెంట్ గా శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన సినిమా మదరాశి. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో, తన నెక్స్ట్ సినిమాలతో అయినా ఖచ్చితంగా హిట్ సాధించాలని ఫిక్స్ అయ్యాడు ఈ హీరో.
Allu Arjun-Atlee: జెట్ స్పీడ్ లో ఫినిష్.. అట్లీ పక్కా ప్లాన్.. అనుకున్నదానికన్నా ముందుగానే..
ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ హీరో లేడీ డైరెక్టర్ సుధా కొంగరాతో “పరాశక్తి” అనే సినిమాను చేస్తున్నాడు. పీరియాడిక్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా కోసం మొదటిసారి జత కట్టిన శివ కార్తికేయన్-శ్రీలీల ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమా చేయనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేటంటే, శివ కార్తికేయన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ లిస్టులో ఉండే సినిమా డాన్. సీబీ చక్రవర్తి తెరకెక్కించిన ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.
ఇప్పుడు ఈ కాంబో మరోసారి రిపీట్ కానుందట. మరోసారి కాలేజ్ బ్యాక్డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుందట. అయితే, ఈ సినిమాలో ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని చూశారట మేకర్స్. కానీ, అనుకోని కారణాల వల్ల రశ్మికను తప్పించి ఆమె ప్లేస్ లో శ్రీలీలను ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
