Hero Satydev Playing Key Role in Vijay Deverakonda VD 12 Movie Rumours goes Viral
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పీరియాడిక్ స్పై యాక్షన్ జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది అని ఆల్రెడీ తెలిపారు. ఇటీవలే వైజాగ్ లో షూటింగ్ కూడా జరిగింది.
Also Read : Harom Hara : సుధీర్ బాబు ‘హరోం హర’ ట్రైలర్ వచ్చేసింది.. ఏకంగా గన్స్ తయారుచేసేస్తున్నారుగా..
అయితే ఈ సినిమాలో మొదట శ్రీలీల హీరోయిన్ అని అనౌన్స్ చేశారు కూడా. కానీ శ్రీలీల డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఈ సినిమా నుంచి తప్పుకుంది. శ్రీలీల(Sreeleela) ప్లేస్ లో మమిత బైజు, భాగ్యశ్రీ భోర్సే.. పలు పేర్లు వినిపించాయి కానీ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఈ సినిమాలో హీరో సత్యదేవ్ నటిస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.
సత్యదేవ్ ఇటీవలే కృష్ణమ్మా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం హీరోగా పలు సినిమాలతో బిజిగాన్ ఉన్నాడు. సత్యదేవ్ గతంలో విలన్ గా చేసినా మళ్ళీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయాలంటే పాత్ర చాలా బాగుండాలి అని అన్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో చేస్తున్నాడు అని వార్తలు వస్తుండటంతో నిజంగానే చేస్తున్నాడా? ఆ పాత్ర అంత నచ్చిందా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అధికారికంగా ప్రకటించేదాకా దీనిపై క్లారిటీ లేనట్టే.