Harom Hara : సుధీర్ బాబు ‘హరోం హర’ ట్రైలర్ వచ్చేసింది.. ఏకంగా గన్స్ తయారుచేసేస్తున్నారుగా..

తాజాగా సుధీర్ బాబు హరోం హర ట్రైలర్ రిలీజ్ చేశారు.

Harom Hara : సుధీర్ బాబు ‘హరోం హర’ ట్రైలర్ వచ్చేసింది.. ఏకంగా గన్స్ తయారుచేసేస్తున్నారుగా..

Updated On : May 30, 2024 / 12:17 PM IST

Harom Hara Trailer : సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘హరోంహర’. 1980’s బ్యాక్‌డ్రాప్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రూరల్ గ్యాంగ్ స్టార్ కథాంశంతో రానున్నట్టు తెలుస్తుంది. జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.

Also Read : Sharwanand – Kartikeya : శర్వానంద్ కాళ్లకు దండం పెట్టిన కార్తికేయ.. వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు..

తాజాగా హరోం హర ట్రైలర్ రిలీజ్ చేశారు. మహేష్ బాబు తన సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ని విడుదల చేశారు. మీరు కూడా హరోం హర ట్రైలర్ చూసేయండి.

ఇక ఈ హరోం హర సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన ఇండియా వైడ్ ఈ సినిమా రిలీజ్ కానుంది. సుధీర్ బాబు గత సినిమాలు ఆశించినంత ఫలితం సాధించలేదు. మరి ఈ సినిమా అయినా సుధీర్ బాబుకి హిట్ ఇస్తుందా చూడాలి.