Sharwanand : తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో తండ్రిగా ప్రమోషన్ పొందాడు.

Hero Sharwanand blessed baby girl
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య రక్షితారెడ్డి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా శర్వానంద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆ చిన్నారికి లీలా దేవి మైనేని అని నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా శర్వానంద్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
View this post on Instagram
రక్షితారెడ్డిని శర్వానంద్ గతేడాది జూన్ 23న వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహాం జరిగింది. జైపూర్‌లోని లీలా ప్యాలెస్ వీరి పెళ్లికి వేదికైంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుఅయ్యారు.
View this post on Instagram