Srikanth : శ్రీకాంత్ చేతుల మీదుగా ‘మహిష’ ఫస్ట్ లుక్ రిలీజ్..

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో హీరో శ్రీకాంత్ ఈ మహిష సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Srikanth : శ్రీకాంత్ చేతుల మీదుగా ‘మహిష’ ఫస్ట్ లుక్ రిలీజ్..

Hero Srikanth Launched Mahisha Movie First Look

Srikanth : స్క్రీన్ ప్లే పిక్చర్స్ ప్రొడక్షన్ లో ప్రవీణ్ K.V దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మహిష’. కొత్త నటీనటులతో సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. తాజాగా మహిష సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Also Read : Varun Sandesh : కాలికి గాయం అయినా.. సినిమా కోసం వరుణ్ సందేశ్.. సెకండ్ ఇన్నింగ్స్ రెడీ..

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో హీరో శ్రీకాంత్ ఈ మహిష సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. మూవీ కథ విన్నాను, కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు. డైరెక్టర్ ప్రవీణ్ K.V మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. నటీనటులతో సంబంధం లేకుండా కథ ఆధారంగా సినిమా ఆద్యంతం మంచి సస్పెన్స్ గా తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాలో అయిదు పాటలు ఉన్నాయి. త్వరలో ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాము అని తెలిపారు.