Varun Sandesh : కాలికి గాయం అయినా.. సినిమా కోసం వరుణ్ సందేశ్.. సెకండ్ ఇన్నింగ్స్ రెడీ..

తాజాగా వరుణ్ సందేశ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Varun Sandesh : కాలికి గాయం అయినా.. సినిమా కోసం వరుణ్ సందేశ్.. సెకండ్ ఇన్నింగ్స్ రెడీ..

Varun Sandesh Says Interesting things about Nindha Movie

Varun Sandesh : వరుణ్ సందేశ్ కొంచెం గ్యాప్ తర్వాత హీరోగా ‘నింద’ సినిమాతో రాబోతున్నాడు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించిన ఈ నింద సినిమా జూన్ 21న విడుదల కాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా వరుణ్ సందేశ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. రెగ్యులర్ గా లవ్ స్టోరీలు చేసి చేసి నాకే బోరింగ్‌ అనిపించింది. ఒకానొక సమయంలో ఏంట్రా ఇలాంటి సినిమాలు చేస్తున్నాను అని కూడా అనుకున్నాను. దీంతో కొంచెం గ్యాప్ తీసుకొని అమెరికా వెళ్ళినప్పుడు రాజేష్ గారు ఈ నింద కథను చెప్పారు. నా కెరీర్ లో ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రలకు ఇది డిఫరెంట్ అవ్వడంతో వెంటనే ఈ సినిమా ఓకే చేశాను. నిందలో చాలా సీరియస్ గా ఉంటాను. బయట కూడా జోవియల్ గా ఉండే నేను ఈ సినిమాలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేయడానికి కొంచెం కష్టపడ్డాను. అందరూ సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నారు కానీ నేను మళ్ళీ కొత్తగా వస్తున్నాను అని అన్నారు.

Also Read : Kalki 2898 AD : ‘కల్కి’ సినిమా కథేంటి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏం చెప్పారంటే..?

డైరెక్టర్, నిర్మాత రాజేష్ జగన్నాధం గురించి చెప్తూ..నింద కథ చెప్తున్నప్పుడే నాకు నచ్చింది. రాజేష్ గారే ఈ సినిమాని నిర్మిస్తాను అని చెప్పాక ఆశ్చర్యపోయాను. తన కథ మీద అంత నమ్మకం ఉంది ఆయనకు. అమెరికాలో చక్కగా జాబ్స్ చేస్తూ హ్యాపీ లైఫ్ గడుపుతున్న ఆయన అన్ని వదిలేసి ఇక్కడికి సినిమా మీద ప్యాషన్ తో వచ్చారు. ఈ సినిమా ప్రయాణంలో నాకు రాజేష్ గారు ఒక మంచి బ్రదర్ గా దొరికారు. మొదటి సినిమాకే డైరెక్టర్ గా, నిర్మాతగా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి అని తెలిపారు.

నింద సినిమా కథ పరంగా పాతదే కావొచ్చు, ఇలాంటి సినిమాలు గతంలో వచ్చే ఉండొచ్చు. కానీ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉండబోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తి కలుగుతుంది. షూటింగ్ టైంలో కూడా స్క్రిప్ట్ మొత్తం ఏ ఆర్టిస్ట్ కి చెప్పకుండా డైరెక్టర్ షూట్ చేసి మాకు కూడా సినిమాపై ఆసక్తి కలిగించారు. నాకు కథ చెప్పేటప్పుడు కూడా నేను గెస్ చేయడానికి ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను అని అన్నారు.

Also Read : NTR Devara : ఎన్టీఆర్ ‘దేవర’ పక్కా హిట్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటున్న ఫ్యాన్స్.. 23 ఏళ్ళ తర్వాత..

అలాగే నింద సినిమా షూటింగ్ సమయంలో ఇబ్బందులు కూడా ఫేస్ చేశాను. కానిస్టేబుల్ సినిమా షూటింగ్ లో కాలికి గాయమైంది. ఆ గాయంతోనే సపోర్ట్ పెట్టుకొని నింద మూవీ షూటింగ్ చేశాను. రాజేష్ గారి ప్యాషన్, డెడికేషన్, కష్టం చూసి నేను బ్రేక్ తీసుకుంటే చాలా నష్టం కలుగుతుంది అని అలాగే కాలికి గాయంతోనే షూట్ చేశాను అని తెలిపారు.

అలాగే వరుణ్ సందేశ్ నింద తర్వాత మరో ఆసక్తికర సినిమాతో రాబోతున్నట్టు, త్వరలోనే ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తానని, ఆ తర్వాత కానిస్టేబుల్ సినిమా ఉంటుందని తెలిపారు. మరి ఇన్నాళ్లు లవర్ బాయ్ గా మెప్పించిన వరుణ్ సందేశ్ ఇప్పుడు సీరియస్ రోల్ లో నింద సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.