Srikanth : రీహాబిలిటేషన్ సెంటర్ పేషేంట్స్ ని పరామర్శించిన శ్రీకాంత్..
హీరో శ్రీకాంత్ న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ లో సేవలు పొందుతున్న పేషేంట్స్ ని పరామర్శించారు.

Hero Srikanth Visited New Life physiotherapy and Rehabilitation Center
Srikanth : హైదరాబాద్ లోని న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవం కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమానికి హీరో శ్రీకాంత్, రీహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రుషిక, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్.. పలువురు పాల్గొన్నారు. ఈ క్రమంలో హీరో శ్రీకాంత్ ఇక్కడ సేవలు పొందుతున్న పేషేంట్స్ ని పరామర్శించారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. పెరాలసిస్ వచ్చిన వాళ్ళను, రోడ్ యాక్సిడెంట్ లో బెడ్ కు పరమితమైన వాళ్ళను చిన్న పిల్లల్లా చూసుకుంటున్నారు. ఇక్కడి స్టాఫ్ ను చూస్తుంటే దేవతల్లా అనిపిస్తున్నారు. రుషిక గారు ఈ సెంటర్ ని తక్కువ రేట్లకే మంచి సేవలు అందిస్తూ చక్కగా నడిపిస్తున్నారు. ఆమె గతంలో కోవిడ్ సమయంలో కూడా మొదటి వేవ్ లోనే ఉచితంగా టీకాలు అందించారు. ఇలాగే ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సేవలు కొనసాగాలి. ఇక్కడికి వచ్చే వారందరికీ మంచి జరగాలి అని అన్నారు.
Also Read : Klin Kaara – Kalki Bujji : చరణ్ కూతురు క్లిన్ కారాకు.. ప్రభాస్ కల్కి ‘బుజ్జి’ గిఫ్ట్.. వాళ్లకు కూడా..
అలాగే న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రుషిక మాట్లాడుతూ.. మా న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ యానివర్సరీ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్బంగా మా స్టాఫ్ తో 5K రన్ నిర్వహించాం. మా సెలబ్రేషన్స్ లో పాల్గొన్న హీరో శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్. రీహాబిలిటేషన్ అంటే అందరూ స్మోకింగ్, డ్రింకింగ్ మానేయడం కోసం అనుకుంటారు. కానీ మా సెంటర్ లో స్పైన్ ఇంజూరీ, లెగ్ ఇంజూరీ, పెరాలసిస్ వల్ల మంచానికే పరిమితమైన వారికి ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సేవలు చేస్తాము. మా నాదగ్గరికి వచ్చే పేషేంట్స్ ని పిల్లల్లా చూసుకుంటాం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్లకు సపోర్ట్ చేయడం కుదరకపోవడంతో ఆ బాధ్యత మేము తీసుకున్నాం. పేషేంట్స్ త్వరగా కోలుకోని వెళ్ళేలాగా మేము తయారుచేస్తాం. త్వరలో సికింద్రాబాద్ లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం అని తెలిపారు.