Trigun : హీరో త్రిగుణ్ కొత్త సినిమా మొదలు.. ‘స్వీటీ నాటీ క్రేజీ’..

కథ, 24 కిసెస్, డియర్ మేఘ, లైన్ మెన్.. లాంటి పలు సినిమాలతో హీరోగా మెప్పించిన త్రిగుణ్ ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో రాబోతున్నాడు.

Trigun : హీరో త్రిగుణ్ కొత్త సినిమా మొదలు.. ‘స్వీటీ నాటీ క్రేజీ’..

Hero Trigun Started a New Movie Titles as Sweet Naughty Crazy

Trigun : కథ, 24 కిసెస్, డియర్ మేఘ, లైన్ మెన్.. లాంటి పలు సినిమాలతో హీరోగా మెప్పించిన త్రిగుణ్ ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో రాబోతున్నాడు. త్రిగుణ్, శ్రీజిత ఘోష్ జంటగా అరుణ్ విజువల్స్ బ్యానర్ పై అరుణ్ నిర్మాతగా రాజశేఖర్.జి దర్శకత్వంలో స్వీటీ నాటీ క్రేజీ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఇనయ, రాధ, అలీ, రఘుబాబు.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓపెనింగ్ కార్యక్రమంలో అలీ క్లాప్ కొట్టగా, నిర్మాత దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ అందచేయగా నిర్మాత బెక్కెం వేణు గోపాల్ గారు ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించారు.

Also Read : Balakrishna : బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలు షురూ..

అనంతరం హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. టైటిల్‌కు తగ్గట్టు స్వీటీ, నాటీ, క్రేజీలా సినిమా ఉంటుంది. నాకు ఇప్పటివరకు కూడా కామెడీ సినిమాలు చిత్రాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇది కూడా అలాగే వర్కౌట్ అవుతుందని తెలిపారు.