ముక్కు మీద కోపం.. ఆపదొస్తే చేస్తోంది సాయం..

కరోనా బాధితులకు హీరోయిన్ కంగనా రనౌత్ రూ.10 లక్షల విరాళం..

ముక్కు మీద కోపం.. ఆపదొస్తే చేస్తోంది సాయం..

Updated On : July 13, 2023 / 12:10 PM IST

కరోనా బాధితులకు హీరోయిన్ కంగనా రనౌత్ రూ.10 లక్షల విరాళం..

లాక్‌డౌన్ నేపథ్యంలో రోజూవారీ సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి అలాగే కరోనా పై పోరాటానికి సినిమా పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందిస్తున్నారు. 
తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. అందులో రూ.5 లక్షలు, ప్రస్తుతం తాను నటిస్తున్న ‘తలైవి’ సినిమాకు పనిచేస్తున్న వర్కర్లకు, అలానే మరొక రూ.5 లక్షలు (FEFSI) ‘సౌత్ ఇండియన్ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్‌’కు అందచేయనున్నారు కంగనా..

ముక్కుసూటిగా మాట్లాడుతుంది కానీ ఆమెది మంచి మనసు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దివంగత తమిళనాటు ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది.