Heroine Karthika Nair Engaged Secretly Photo goes Viral
Karthika Nair : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ(Radha) కూతురిగా తెలుగులో జోష్(Josh) సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైంది కార్తీక నాయర్. ఆ తర్వాత తమిళ్ లో రంగం సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సాధించింది. తెలుగు, తమిళ్ లో పలు సినిమాల్లో నటించిన కార్తీక 2015 లో తమిళ్ లో ఓ సినిమా చేసిన తర్వాత సినిమాలకు దూరమైంది.
కార్తీక సినిమాలకు దూరమై తన ఫ్యామిలీకి ఉన్న హోటల్స్ బిజినెస్ చూసుకుంటుంది. దుబాయ్ లో తమ బిజినెస్ ని మరింత విస్తరించి పలు అవార్డులు కూడా అందుకుంది. బిజినెస్ వుమెన్ గా ప్రస్తుతం కార్తీక దూసుకుపోతుంది. తాజాగా కార్తీక షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.
Also Read : Sunainaa : హాస్పిటల్ బెడ్‌పై హీరోయిన్.. చేతికి సెలైన్‌తో.. ఆందోళనలో అభిమానులు..
ఓ అబ్బాయిని కౌగలించుకొని చేతికి ఉన్న రింగ్ చూపిస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది కార్తీక. అయితే ఆ అబ్బాయి ఎవరో చూపించలేదు. దీంతో కార్తీక నిశ్చితార్థం చేసుకుందని తెలుస్తుంది. అభిమానులు, నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు కూడా కార్తీకకు కంగ్రాట్స్ చెప్పడంతో కార్తీక ఎంగేజ్మెంట్ చేసుకుందని అంతా ఫిక్స్ అయ్యారు. మరి ఈ బిజినెస్ వుమెన్ ని పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరో. పెళ్లి చేసుకుంటే అప్పుడైనా ఫోటోలు షేర్ చేస్తుందో లేదో చూడాలి.