Pooja Hegde: పూజ హెగ్దే కాలుకి గాయం..

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్దే.. దక్షణాది స్టార్ హీరోస్ నుంచి ఉత్తరాది స్టార్ హీరోల వరకు అందరి సినిమాలో ఛాన్సులు అందిపుచ్చుకుంటూ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడి కాలుకి గాయం అయినట్లు తెలుస్తుంది.

Pooja Hegde: పూజ హెగ్దే కాలుకి గాయం..

Heroine Pooja Hegde Gets injured

Updated On : October 20, 2022 / 4:46 PM IST

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్దే.. దక్షణాది స్టార్ హీరోస్ నుంచి ఉత్తరాది స్టార్ హీరోల వరకు అందరి సినిమాలో ఛాన్సులు అందిపుచ్చుకుంటూ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడి కాలుకి గాయం అయినట్లు తెలుస్తుంది.

Pooja Hegde: పూజా హెగ్దే బర్త్ డేని గ్రాండ్‌‌గా సెలెబ్రేట్ చేసిన సల్మాన్ అండ్ వెంకటేష్..

ప్రస్తుతం పూజ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా ఝాన్‌’, రణ్‌వీర్ సింగ్ ‘సర్కస్’ సినిమాల్లో నటిస్తుండగా.. తాజాగా ఆమె కాలుకి గాయం అయ్యినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేసింది. అయితే గాయం ఎలా అయ్యిందనే విషయాన్ని తెలియజేయలేదు. ఇక విషయం తెలిసిన ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవలే సైమా అవార్డుల పురస్కారాలోనూ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును సైతం సొంతం చేసుకుంది ఈ బుట్టబొమ్మ. ఇక టాలీవుడ్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28లో మహేష్ బాబు సరసన నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.