MAA ఎన్నికలు: రాహుల్, మోడీ పోటీ పడుతున్నట్లు ఉంది

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటికే సినీ సెలబ్రిటీలంతా తరలవచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటుండగా టాప్ హీరోయిన్ రకుల్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. MAA ఎన్నికలు చూస్తుంటే… ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మధ్య ఫైట్‌లా కనిపిస్తుందని అన్నారు. శివాజీ రాజా, నరేష్ ఇద్దరు తమకు కావాల్సిన వాళ్లేనని, ఏ రంగంలో అయినా మహిళలకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. మార్పు రావాలని కోరుకున్నట్లు రకుల్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.