Ritika Singh : 32 రోజులపాటు తలస్నానం చేయకుండా.. ఒకే డ్రెస్‌తో షూటింగ్ చేసిన రితికా..

రితిక సింగ్ మెయిన్ లీడ్ లో ‘ఇన్‌ కార్‌’ సినిమాని తమిళ్ లో తెరకెక్కించి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది పాత్రలతో దాదాపు సినిమా మొత్తం ఒక కార్ లోనే తీశారు..............

Ritika Singh : 32 రోజులపాటు తలస్నానం చేయకుండా.. ఒకే డ్రెస్‌తో షూటింగ్ చేసిన రితికా..

Heroine Ritika Singh didn't take head bath up to 32 days due to in car movie shoot

Updated On : February 26, 2023 / 10:02 AM IST

Ritika Singh :  బాక్సింగ్ ఛాంపియన్ రితికా సింగ్ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి క్లిక్ అవ్వడంతో వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగులో గురు సినిమాతో ప్రేక్షకులని మెప్పించింది. ఇక తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం రితికా చేతిలో దాదాపు అరడజను తమిళ సినిమాలు ఉన్నాయి. రితికా సింగ్ మెయిన్ లీడ్ లో నటించిన ‘ఇన్‌ కార్‌’ సినిమా మార్చ్ 3న రిలీజ్ కానుంది.

రితిక సింగ్ మెయిన్ లీడ్ లో ‘ఇన్‌ కార్‌’ సినిమాని తమిళ్ లో తెరకెక్కించి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది పాత్రలతో దాదాపు సినిమా మొత్తం ఒక కార్ లోనే తీశారు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి, రేప్ చేయడానికి ప్రయత్నించే ఘటనతో ఈ సినిమాని తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా రానుంది.

Selfiee Collections : బాలీవుడ్ లో మరో డిజాస్టర్.. సెల్ఫీ సినిమాకు అక్షయ్ కుమార్ కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్

తాజాగా ‘ఇన్‌ కార్‌’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శనివారం నాడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్. ఈ ప్రెస్ మీట్ లో రితికా మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో నటనకు ఆస్కారమున్న పాత్ర దొరికింది. సినిమా చాలావరకు కార్ లోనే షూట్ చేశాము. ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తుంది సినిమా. ఈ సినిమా కోసం షూటింగ్ అయ్యేంతవరకు 32 రోజులపాటు తల స్నానం చేయలేదు. సినిమా మొత్తం ఒకే డ్రెస్ మీద తీశారు. అత్యాచార ఘటనలపై ఈ సినిమా చూపించే విధానం అందర్నీ ఆలోచించేలా చేస్తుంది అని తెలిపింది.