Sada: హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం… తండ్రి సయ్యద్ కన్నుమూత
సౌత్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు(Sada). వారం రోజుల క్రితమే ఆయన చనిపోయారు కానీ, తాజాగా సదా ఈ విషయం గురించి ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో తెలిసింది.

Heroine Sada's father Syed passes away
Sada: సౌత్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు. వారం రోజుల క్రితమే ఆయన చనిపోయారు కానీ(Sada), తాజాగా సదా ఈ విషయం గురించి ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో తెలిసింది. విషయం తెలియడంతో సదా స్నేహితులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక తన నాన్న మరణం పట్ల సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది సదా.
Mirai: మిరాయ్ మేకర్స్ కి షాక్.. నా కథను కాపీ చేశారు.. హైకోర్టులో పిటీషన్ వేసిన రచయిత
“నాన్న చనిపోయి వారం రోజులు గడించింది. కానీ, ఓ యుగంలా అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ కాదు అనే రోజుల్లో కుటుంబాన్ని ఎదిరించి నాకు అండగా నిలిచారు నాన్న. నా షూటింగ్‌ల వల్ల నాన్న ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. కొన్నేళ్ల పాటు నాతో షూటింగ్స్‌కి వచ్చారు. ఆ తరువాత కొంతకాలానికి నాన్న ఓ చిన్న క్లినిక్ మొదలుపెట్టారు. ఎంతో మంది మనుషులకు, జంతువులకు వైద్యాన్ని అందించారు. ఆయనకు కూతురు కావడం నాకు గర్వకారణం. నిజంగా ఆయనొక వెలకట్టలేని మనిషి. మిస్ యూ నాన్న” అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది సదా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
View this post on Instagram