Aghoraa : ఇప్పటివరకు అఘోరా పాత్రలో కనిపించిన హీరోలు వీళ్లే

'అఖండ' సినిమాలో బాలయ్య బాబు శివ భక్తుడిగా అఘోరాగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. అయితే బాలకృష్ణ కంటే ముందే మన హీరోల్లో కొంతమంది అఘోరా పాత్రలో.........

Aghoraa : ఇప్పటివరకు అఘోరా పాత్రలో కనిపించిన హీరోలు వీళ్లే

Aghora Bb

Aghoraa :  ‘అఖండ’ సినిమాలో బాలయ్య బాబు అఘోరా పాత్రలో అదరగొట్టాడు. దీంతో మరోసారి అఘోరాల గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. మన దేశంలో హిమాలయాల్లో, కాశి లాంటి ప్రాంతాల్లో అఘోరాలు ఉంటారు. మన దేశంలో జరిగే కుంభమేళాలో ఎంతో మంది అఘోరాలు పాల్గొంటారు. అఘోరాలు ఎక్కువగా శివ భక్తులు ఉంటారు. అయితే అఘోరాలలో దుష్ట శక్తులు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ‘అఖండ’ సినిమాలో బాలయ్య బాబు శివ భక్తుడిగా అఘోరాగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. అయితే బాలకృష్ణ కంటే ముందే మన హీరోల్లో కొంతమంది అఘోరా పాత్రలో నటించి మెప్పించారు.

Pushpa : ‘పుష్ప’ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నా అంటున్న జెనీలియా భర్త

‘శ్రీ మంజునాథ’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి శివుని పాత్రలో నటించారు. ఇందులో కొన్ని సన్నివేశాల్లో శివుడు భూమి మీదకి వచ్చినప్పుడు అఘోరాగా కనిపిస్తారు. హిమాలయాల నుంచి వచ్చిన అఘోరాలం అని చెప్తాడు చిరంజీవి ఈ సినిమాలో.

‘ఢమరుకం’ సినిమాలో నాగార్జున కూడా కొన్ని నిమిషాల పాటు అఘోర గెటప్‌లో కనిపించి మెప్పిస్తాడు.

‘అఘోర’ అనే ఓ సినిమాలో నాగబాబు టైటిల్ రోల్ అఘోరాగా కనిపిస్తాడు.

తమిళ హీరో ఆర్య ‘నేను దేవున్ని’ సినిమాలో అఘోరగా అదరగొట్టాడు. ఇందులో అఘోరా పాత్ర కోసం ఆర్య నిజమైన అఘోరాలతో కొన్ని రోజులు ట్రావెల్ చేశాడు. ఈ సినిమాకి, ఇందులో అఘోరా పాత్రకు కాను ఆర్యకు బాగా పేరు వచ్చింది.

‘నాగవల్లి’ సినిమాలో వెంకటేష్ కూడా కొన్ని నిమిషాల పాటు అఘోరా గెటప్ లో కనిపిస్తాడు. రాజు అఘోరాగా మారడం ఇందులో చూపిస్తారు.

‘అరుంధతి’ సినిమాలో అఘోరాగా సోనూసూద్ అద్భుతంగా నటిస్తాడు. అయితే ఇది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. ఇందులో పశుపతిగా సోనూసూద్ బాగా భయపెట్టాడు ప్రేక్షకులని. ఈ సినిమా తర్వాత సోనూసూద్ కి తెలుగులో క్రేజ్ బాగా పెరిగింది.

త్వరలో ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాలో మంచు మనోజ్ కూడా అఘోరగా నటించబోతున్నాడని సమాచారం.

అలాగే యువ హీరో విశ్వక్ సేన్ కూడా త్వరలో రాబోతున్న ‘గామీ’ సినిమాలో అఘోరాగా కనిపించబోతున్నాడని సమాచారం.

Akhanda : ‘అఖండ’ సినిమాలో కనిపించిన ఎద్దుల గురించి తెలుసా ??

ఇక ‘అఖండ’లో మన బాలయ్య బాబు అఘోరాగా ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మనందరం చూశాం. బాలయ్య అఘోరా పర్ఫార్మెన్స్ కు టాలీవుడ్ మాత్రమే కాక బాలీవుడ్, హాలీవుడ్ నుంచి కూడా ప్రశంశలు వస్తున్నాయి.