TS High Court : బెనిఫిట్‌ షోలు ర‌ద్దు చేశామ‌ని అంటూ ప్రత్యేక షోలకు అనుమతేంటి?: హైకోర్టు

గేమ్ ఛేంజ‌ర్ మూవీ టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

High Court Questioning on Special Screening Shows of Game Changer Movie in Telangana

గేమ్ ఛేంజ‌ర్ మూవీ టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌ల దృష్ట్యా ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై హైకోర్టు అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామని చెబుతూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వ‌డం ఏమిట‌ని న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది.

అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునసమక్షించాలని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హైకోర్టు ఆదేశించింది. భారీ బ‌డ్జెట్‌తో సినిమా తీసి ప్రేక్ష‌కుల నుంచి వ‌సూలు చేయాల‌నుకోవ‌డం స‌రికాద‌ని హిత‌వు ప‌లికింది. త‌దుప‌రి విచార‌ణ ఈ నెల 24కి వాయిదా వేసింది.

Game Changer OTT partner : రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజ‌ర్’ ఓటీటీ పార్ట‌న‌ర్ ఫిక్స్‌.. ఎందులో మూవీ స్ట్రీమింగ్ కానుందంటే..?

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాష్ట్రంలో ఈ సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇందుకు సంబంధించి హోంశాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ర‌వి గుప్తా ఉత్త‌ర్వులు జారీ చేశారు. అర్థ‌రాత్రి ఒంటి గంట‌కు బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి నిరాక‌రించినా జ‌న‌వ‌రి 10న ఉద‌యం 4 గంట‌ల‌కు ప్ర‌త్యేక షో వేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది.

ఈ క్ర‌మంలో గేమ్ ఛేంజ‌ర్ టికెట్ ధ‌ర‌ల పెంపు, స్పెష‌ల్ షోల‌పై గొర్ల భరత్‌ రాజ్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్ దాఖ‌లు చేశారు. గురువారం దీనిపై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. టికెట్ ధ‌ర‌ల పెంపు అనేది నిబంధ‌న‌ల‌కు విరుద్దం అని పిటిష‌న్ త‌రుపు న్యాయ‌వాది వాదించారు. వెంట‌నే గేమ్ ఛేంజ‌ర్ టికెట్ ధ‌రల పెంపు ఉత్త‌ర్వుల‌ను నిలుపుద‌ల చేసేలా ఆదేశాలివ్వాల‌ని కోరారు. విచార‌ణ‌ను నేటికి వాయిదా వేసిన న్యాయ‌స్థానం, నేడు మ‌రోవారు విచార‌ణ చేప‌ట్టి ప్ర‌భుత్వ తీరుపై అసంతృప్తిని వ్య‌క్తం చేసింది.

Game Changer : ‘నానా హైరానా’ పాట ఎక్క‌డ‌..? మూవీలో లేని సాంగ్.. టీమ్ ఏమ‌న్న‌దంటే..?

ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజ‌ర్ సినిమా నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అంజ‌లి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌స్తోంది.