Game Changer OTT partner : రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజ‌ర్’ ఓటీటీ పార్ట‌న‌ర్ ఫిక్స్‌.. ఎందులో మూవీ స్ట్రీమింగ్ కానుందంటే..?

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌.

Game Changer OTT partner : రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజ‌ర్’ ఓటీటీ పార్ట‌న‌ర్ ఫిక్స్‌.. ఎందులో మూవీ స్ట్రీమింగ్ కానుందంటే..?

Ram Charan Game Changer OTT partner fix

Updated On : January 10, 2025 / 11:07 AM IST

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. కియారా అద్వానీ క‌థానాయిక‌. అంజ‌లి, ఎస్‌జే సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌స్తోంది.

ఇక ఈ చిత్ర ఓటీటీ పార్ట‌న‌ర్ ఎవ‌రో తెలిసి పోయింది. ఈ చిత్ర టైటిల్ కార్డ్స్‌లో ఈ విష‌యాన్ని చెప్పేశారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది.

Game Changer : ‘నానా హైరానా’ పాట ఎక్క‌డ‌..? మూవీలో లేని సాంగ్.. టీమ్ ఏమ‌న్న‌దంటే..?

కాగా.. భారీ మొత్తానికి అమెజాన్ ఈ చిత్ర ఓటీటీ హక్కుల‌ను ద‌క్కించుకున్న‌ట్లుగా తెలుస్తోంది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఎనిమిది వారాల త‌రువాత‌నే ఓటీటీలో వ‌చ్చేలా అగ్రిమెంట్ జ‌రిగిన‌ట్లు టాక్‌. దీనిపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఇక శాటిలైట్ హ‌క్కుల‌ను జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది.

అప్ప‌న్న పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న అదిరిపోయిన‌ట్లుగా ప్రేక్ష‌కులు చెబుతున్నారు. శంక‌ర్ చాలా గ్రాండియ‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించాడ‌ని, జ‌ర‌గండి సాంగ్ ఓ రేంజ్‌లో ఉంద‌ని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. నానా హైరానా సాంగ్ మాత్రం థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌లేదు. ఇన్‌ప్రారెడ్ కెమెరాతో చిత్రీక‌రించిన తొలి భారతీయ పాట ఇది. సినిమా ప్ర‌మోష‌న‌ల్లో భాగంగా ఈ పాట‌ను విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

కాగా.. థియేట‌ర్ల‌లో ఈ సాంగ్ చూద్దామ‌న్న వారికి నిరాశే ఎదురైంది. కొన్ని సాంకేతిక‌ కార‌ణాల వ‌ల్ల ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయిన‌ట్లు చిత్ర బృందం తెలిపింది. జ‌న‌వ‌రి 14 నుంచి ఈ సాంగ్‌ను జోడించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని పాట‌ల కోస‌మే రూ.75 కోట్లు ఖ‌ర్చు చేశారు.

Game Changer Movie Review : ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ.. శంకర్, చరణ్ కాంబో వర్కౌట్ అయిందా?