×
Ad

Ala Vaikunthapurramuloo : హిందీలో ‘అల..వైకుంఠపురములో’..

‘పుష్ప’ క్రేజ్‌తో ఇప్పుడు ‘అల..వైకుంఠపురములో’ హిందీలో రిలీజ్ చెయ్యబోతున్నారు..

  • Published On : January 17, 2022 / 02:52 PM IST

Ala Vaikunthapurramuloo

Ala Vaikunthapurramuloo: ‘పుష్ప’తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పీక్స్‌కి చేరుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ‘పుష్ప’ క్రియేట్ చేసిన సెన్సేషన్ చూసి షాక్ అయ్యారంతా.. హిందీ డిస్ట్రిబ్యూటర్ విషయంలో కాస్త సస్పెన్స్ నెలకొన్నా ఎట్టకేలకు బన్నీ రంగంలోకి దిగి.. అక్కడి బయ్యర్‌తో మాట్లాడి రిలీజ్ చేయించాడు.

Pushpa Movie : రెండో వారంలోనూ రచ్చ లేపాడు.. 200 కోట్ల క్లబ్‌లోకి దగ్గర్లో..

కట్ చేస్తే, సినిమా ఎవరూ ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు సినిమా కలెక్షన్లంతా కూడా మా హిందీ సినిమాల ఓపెనింగ్స్ రావడం లేదు అని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అన్నారంటే ‘పుష్ప’ ఏ రేంజ్‌లో రచ్చ రంబోలా చేసిందో అర్థం చేసుకోవచ్చు. నార్త్‌లో బన్నీకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది ‘పుష్ప’.

Pushpa Movie : ‘పుష్ప’ ముందు హిందీ సినిమాలు తేలిపోయాయి-కరణ్ జోహర్..

హిందీ వెర్షన్ దాదాపు రూ. 50 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో పార్ట్ 2కి రూ. 100 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ‘పుష్ప’ క్రేజ్‌తో ఇప్పుడు ‘అల..వైకుంఠపురములో’ హిందీలో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఏఏ ఫిల్మ్స్, గోల్డ్ మైన్స్ ఫిల్మ్స్ వారు ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

Allu Arjun : ‘‘సౌత్ కా సుల్తాన్’’.. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘అల..వైకుంఠపురములో’ 2020 సంక్రాంతికి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో రికార్డ్ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమాను హిందీ‌లో డబ్ చేసి, రిప్లబిక్ డే కానుకగా జనవరి 26న భారీ స్ధాయిలో విడుదల చెయ్యబోతున్నారు. థమన్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ ఎసెట్‌గా నిలిచింది.

Pushpa Movie : ‘సామీ సామీ’ సాంగ్‌కి నేపాల్ ఫ్యాన్స్ రచ్చ రంబోలా!