‘సైరా’ అందరూ చూడదగిన చిత్రం : వెంకయ్యనాయుడు

చిరంజీవి ‘సైరా’ చూడవలసిందిగా కోరగా.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ‘సైరా’ సినిమా చూశారు..

  • Published By: sekhar ,Published On : October 17, 2019 / 05:25 AM IST
‘సైరా’ అందరూ చూడదగిన చిత్రం : వెంకయ్యనాయుడు

Updated On : October 17, 2019 / 5:25 AM IST

చిరంజీవి ‘సైరా’ చూడవలసిందిగా కోరగా.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ‘సైరా’ సినిమా చూశారు..

‘ఊరువాడ చూడదగిన ఉత్తమ చిత్రం ‘సైరా’.. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణాదాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు’.. అన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ‘సైరా’ సినిమా చూశారు..

సాత్వంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి   ప్రధాన పాత్రలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’ భారీగా విడుదలైంది. చిరంజీవి, వెంకయ్యనాయుడిని కలిసి ‘సైరా’ చూడవలసిందిగా కోరగా.. వెంకయ్యనాయుడు సినిమా చూశారు.

Read Also : కృష్ణవంశీ ‘రంగమార్తాండ’

అనంతరం.. ‘బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరిస్తూ.. స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటస్ఫూర్తితో.. రూపొందించిన ‘సైరా’ చిత్రం బాగుంది. నటులు శ్రీ చిరంజీవి, శ్రీ అమితాబ్ బచ్చన్,  దర్శకుడు శ్రీ సురేందర్ రెడ్డికి అభినందనలు. నిర్మాత శ్రీ రామ్ చరణ్ తేజ్‌కు ప్రత్యేక అభినందనలు’.. అంటూ వెంకయ్యనాయుడు చిత్ర బృందాన్ని అభినందించారు.