Erracheera : ‘ఎర్రచీర’ గ్లింప్స్ రిలీజ్.. డివోషనల్ టచ్ తో..

తాజాగా ఎర్రచీర - ది బిగినింగ్ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Erracheera Movie Glimpse Released

Erracheera : బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న సినిమా ‘ఎర్రచీర – ది బిగినింగ్’. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, అజయ్, రవి శంకర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని సుమన్ బాబు దర్శకత్వంలో మదర్ సెంటిమెంట్ తో పాటు హారర్, యాక్షన్, డివోషనల్ కథతో తెరకెక్కిస్తున్నారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏ ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.

Also Read : Suriya : థియేటర్ల వివాదం.. సూర్యను సూటి ప్రశ్న అడిగిన కన్నడ జర్నలిస్ట్.. సూర్య ఏమన్నాడంటే..

తాజాగా ఎర్రచీర – ది బిగినింగ్ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..

ఈ ఈవెంట్లో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఇటీవల హారర్, దేవుడు కాన్సెప్ట్ లతో సినిమాలు వచ్చి మంచి హిట్ అవుతున్నాయి. ఇది కూడా ఆ ట్రెండ్ లోనే వస్తుంది. మంచి హిట్ అవ్వాలి అన్నారు. సినిమా దర్శక నిర్మాత సుమన్ బాబు మాట్లాడుతూ.. కార్తీకమాసంలో ఎర్రచీర గ్లింప్స్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టాము. ఈ సినిమాలో 22 పాత్రలతో పాటు ఎర్రచీర 23వ పాత్రగా ఉంటుంది. సినిమాలో మొత్తం 45 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటాయి. సీక్వెల్ కూడా ఉంది ఈ సినిమాకు అని తెలిపారు.

హీరోయిన్ కారుణ్య చౌదరి మట్లాడుతూ.. ఈ గ్లింప్స్ మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. కథలో మదర్ సెంటిమెంట్ కన్నీళ్లు పెట్టిస్తుంది అని తెలిపింది.