Horror Movie Raa Raja Release Date Announced by Tammareddy Bharadwaj
Raa Raja : శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ పై బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన సినిమా ‘రా రాజా’. ఆర్టిస్టుల్ని, వాళ్ళ ముఖాలను చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ఇది. అసలు నటీనటుల మొహాలు చూపించకుండా సినిమా తీయడం అంటే సాహసమే. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేయగా తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ రిలీజ్ డేట్ పోస్టర్ ని లాంచ్ చేసారు. రా రాజా సినిమా ప్రేక్షకులను భయపెట్టడానికి మార్చ్ 7న రిలీజ్ కానుంది.
రిలీజ్ డేట్ అనౌన్స్ అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. రా రాజా టైటిల్ చూస్తే ఏదో ప్రేమ కథలా అనిపించింది. కానీ సినిమాలో ఒక్క మొహం కూడా కనిపించకుండా హారర్ సినిమా అని తెలియడంతో ఆశ్చర్యం వేసింది. అసలు మొహాలు చూపించకుండా సినిమా తీసి డైరెక్టర్ శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. డ్యూయెల్ అని స్పీల్ బర్గ్ తీసిన చిత్రంలోనూ మొహాలు కనిపించవు. ఇది చాలా పెద్ద ప్రయోగం. ఇది సక్సెస్ అయితే ఇండస్ట్రీలో మార్పు వస్తుంది. హీరోలు, హీరోయిన్స్, స్టార్లతో పని లేకుండా సినిమాలు చేయొచ్చని అందరూ ముందుకు వస్తారు. మార్చి 7న ఈ సినిమా రాబోతోంది అని తెలిపారు.
డైరెక్టర్ శివ ప్రసాద్ మాట్లాడుతూ.. మా ట్రైలర్ చూసి అభినందించి రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ధన్యవాదాలు. ఆర్టిసుల మొహాలు కనిపించకుండా కథ, కథనమే ముఖ్యం అని ఈ సినిమా చేసాం. మా ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను అని అన్నారు.
Also Read : Akira Nandan : ఓజి మూవీలో అఖీరా నందన్ ఎంట్రీ ఉండబోతుందా?