Akira Nandan : ఓజి మూవీలో అఖీరా నందన్ ఎంట్రీ ఉండబోతుందా?

పవన్‌ కల్యాణ్‌ వారసుడు అకిరానందన్ త్వరలోనే వెండితెర మీద కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

Akira Nandan : ఓజి మూవీలో అఖీరా నందన్ ఎంట్రీ ఉండబోతుందా?

Pawan Kalyan Focus on Akira Nandan Entry in Tollywood

Updated On : February 20, 2025 / 7:25 PM IST

Gossip Garage : మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో అరంగేట్రానికి అంతా రెడీ అవుతోందట. డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ వారసుడు అకిరానందన్ త్వరలోనే వెండితెర మీద కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. పవన్ తనయుడు అకిరానందన్ సినీ ఎంట్రీ కోసం ఈగర్లీగా వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్ ఈ న్యూస్‌ విని ఫుల్ ఫిదా అవుతున్నారు.

అయితే అకిరా ఓజీలో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. అది ఎంత వరకు నిజమో ఓజీ టీమ్ క్లారిటీ ఇస్తే తప్ప స్పష్టత వచ్చేలా లేదు. ఇక RC16లో కూడా అకిరా నటిస్తున్నాడని టాక్ వినిపించింది. అందులో అకిరా రోల్‌ ఏంటి..యాక్ట్ చేస్తుంది నిజమేనా అన్నది RC16 టీమ్‌ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.

Ramam Raghavam : ‘రామం రాఘవం’ మూవీ రివ్యూ.. ఏడిపించేసిన జబర్దస్త్ ధనరాజ్..

అయితే అకిరానందన్ సినిమా ఎంట్రీకి ఇంకో రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందంటున్నారు. అప్పటి వరకు పవన్‌తోనే అకిరానందన్ ఉంటాడంటున్నారు. పవన్ ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు అకిరానందన్‌ను కూడా తీసుకెళ్తున్నారు. సినిమా ఎంట్రీ కంటే ముందే అకిరానందన్ దేశవ్యాప్తంగా సెలబ్రిటీగా పాపులర్ అవుతున్నాడు.

The Devils Chair : హీరోగా జబర్దస్త్ అభి.. సినిమా రేపే రిలీజ్.. కొత్త కాన్సెప్ట్ తో డైరెక్టర్..

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ న్యూస్ వినిపిస్తుంది. అకిరానందన్ ఫస్ట్ మూవీకి పవన్ కల్యాణ్‌ స్టోరీ రాయబోతున్నాడంటున్నారు. 2003లో పవన్ జానీ సినిమాతో స్టోరీ డైరెక్టర్‌గా చేస్తూ హీరోగా నటించాడు. మళ్ళీ ఇప్పుడు కొడుకు సినిమా కోసం కలం కదుపుతున్నాడని అంటున్నారు. ఇది నిజమో కాదో కానీ పవన్ నిజంగానే స్టోరీ ఇస్తే అకిరాకు లైఫ్‌ టైమ్‌ మెమోరిబుల్‌గా ఉంటుందంటున్నారు ఫ్యాన్స్.