The Devils Chair : హీరోగా జబర్దస్త్ అభి.. సినిమా రేపే రిలీజ్.. కొత్త కాన్సెప్ట్ తో డైరెక్టర్..
అదిరే అభి హీరోగా తెరకెక్కిన సినిమా 'ది డెవిల్స్ చైర్'.

Jabardasth Fame Adire Abhi Horror Movie The Devils Chair Directed by Ganga Sapthasikhara Releasing
కమెడియన్ గా, నటుడిగా, జబర్దస్త్ తో మనల్నిమెప్పించినా అదిరే అభి గతంలో కూడా హీరోగా పలు సినిమాలు చేసాడు. ఇప్పుడు హీరోగా మరో సినిమాతో రాబోతున్నాడు. అదిరే అభి హీరోగా తెరకెక్కిన సినిమా ‘ది డెవిల్స్ చైర్’. KK చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర సుబ్బగిరి నిర్మాణంలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
డైరెక్టర్ గంగ సప్తశిఖర మొదటి సినిమా ఇది. సాధారణంగా మొదటి సినిమా అంటే సేఫ్ జోన్‌లో ఉంటారు డైరెక్టర్స్. అయితే గంగ సప్తశిఖర తొలి సినిమాతోనే ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమాలో హారర్ కోసం అప్డేటెడ్ ఏఐ టెక్నాలజీ ఉపయోగించాడు.
Ramam Raghavam : ‘రామం రాఘవం’ మూవీ రివ్యూ.. ఏడిపించేసిన జబర్దస్త్ ధనరాజ్..
గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కించగా అవి పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు లిమిటెడ్ బడ్జెట్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో అదిరే అభి హీరోగా ‘ది డెవిల్స్ చైర్’ అనే సినిమాని తెరకెక్కించారు గంగ సప్తశిఖర.
అందుకే ఈ హీరోయిన్ ఇంత ఫిట్‌గా, ఇంత అందంగా ఉంటుందా? దుమ్ము రేపుతున్న వర్కౌట్ వీడియో చూశారా?
మనిషికి ఉండే దురాశ మీదే ఈ సినిమా కాన్సెప్ట్ రాసుకున్నామని, ఈ సినిమా అందరిని భయపెడుతుందని, ది డెవిల్స్ చైర్ చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్ చేస్తుంది. డెవిల్ మీ ఇంటికి వస్తుంది అని డైరెక్టర్ గంగ సప్త శిఖర అన్నారు. రేపు ఫిబ్రవరి 21న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజవ్వనుంది. ఈ సినిమా రిలీజవ్వకముందే జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా W/O అనిర్వేష్ అనే సినిమాను కూడా రెడీ చేసాడు గంగ సప్తశిఖర. త్వరలో ఆ సినిమా కూడా రిలీజ్ కానుంది.