అందుకే ఈ హీరోయిన్‌ ఇంత ఫిట్‌గా, ఇంత అందంగా ఉంటుందా? దుమ్ము రేపుతున్న వర్కౌట్ వీడియో చూశారా?

ఈ హీరోయిన్‌లా మీరూ చేస్తే చాలా ఫిట్‌గా ఉంటారు.

అందుకే ఈ హీరోయిన్‌ ఇంత ఫిట్‌గా, ఇంత అందంగా ఉంటుందా? దుమ్ము రేపుతున్న వర్కౌట్ వీడియో చూశారా?

Updated On : February 20, 2025 / 4:46 PM IST

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్ కి ఫిట్‌నెస్ పై ఎంత ఆసక్తి ఉందో కింద ఉన్న వీడియో చూస్తే అర్థమవుతుంది. ఫిట్‌నెస్ ట్రైనర్ మహేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కరీనా వర్కౌట్ వీడియో షేర్ చేశాడు. దీనిని బట్టి చూస్తే ఆమె పర్ఫెక్ట్ షేప్‌లో ఉండేందుకు కఠినమైన వ్యాయామాలు చేయడానికి కూడా వెనుకాడదు అనేది అర్థమవుతుంది.

ఆ వీడియోలో, కరీనా కపూర్ ఓ ప్రొఫెషనల్‌లా లిఫ్ట్ చేయడం, కార్డియో వ్యాయామం చేయడం, ప్రతి మువ్‌కి పూర్తి ఎనర్జీ ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే కరీనాను గమనిస్తే చాలా ఏకాగ్రతతో ఫోకస్ పెడుతూ దృఢ సంకల్పంతో వ్యాయామం విషయంలో స్ట్రాంగ్‌గా ఉన్నారని తెలుస్తుంది. కరీనా వర్కౌట్ వీడియో ఫిట్‌నెస్ ప్రేమికులకు ఒక ఛాలెంజ్ విసిరినట్టు ఉంది.

ఆమె చేసిన వ్యాయామాలు

1) రివర్స్ ప్లాంక్ వాక్
ప్లాంక్ పొజిషన్‌లో ఉండి, నేలపై రెండు చేతులను పెట్టి, కాళ్లను ట్రెడ్‌మిల్‌పై ఉంచి, వెనక్కి నడుస్తూ వర్కౌట్ చేసింది. ఈ వ్యాయామం వలన శరీర సమతుల్యతను పెంచుకోవచ్చు.

2) డెడ్ బగ్ క్రాల్
నేలపై పడుకుని కాళ్లతో కదులుతూ రెండు చేతుల్లో రెండు డంబెల్స్ పట్టుకుని వర్కౌట్ చేసింది. ఈ వ్యాయామం సవాలుతో కూడిన ప్రభావవంతమైన వ్యాయామం. దీనివలన కండరాలు బలంగా తయారవడమే కాకుండా వెన్నెముకకు చాలా మంచిది. ఇది ఎక్కువగా స్టామినాను పెంచుకోవడానికి చేస్తారు.

3) ప్లాంక్ వాక్స్
పుష్-అప్స్‌తో కలిపి డంబెల్స్‌తో వెయిట్ లిఫ్ట్ చేసింది. ఈ వ్యాయామం ఛాతీ, భుజాలు, చేతులు అలాగే వెనుకభాగంలోని కండరాలను బలోపేతం చేస్తుంది.

4) స్లైడ్-టు-స్లైడ్ డిప్స్
ప్లాంక్ పొజిషన్‌లో ఉండి, కాళ్లను బెంచ్ పై ఉంచి సైడ్-టు-సైడ్ డిప్స్ చేస్తూ, ప్రతి మోషన్‌లో బంతిని పట్టుకొని వర్కౌట్ చేసింది. ఈ వ్యాయామం వెన్నెముకకు చాలా మంచిది.

ఫైనల్ గా చెప్పాలంటే కరీనా కపూర్ వర్కౌట్ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఫిట్‌నెస్ కోసం వర్కౌట్ ట్రై చేయాలనే ఉత్సాహం అందరికీ వస్తుంది!