ప్రిన్స్ కూతురు సితార మట్టి గణపతుల్ని ఎలా చేసిందో చూడండి: మీరూ చేసుకోండి

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 06:11 AM IST
ప్రిన్స్ కూతురు సితార మట్టి గణపతుల్ని ఎలా చేసిందో చూడండి: మీరూ చేసుకోండి

Updated On : September 1, 2019 / 6:11 AM IST

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మ‌హేష్ గారాల ప‌ట్టి సితార, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కుమార్తె ఆద్య ఇద్ద‌రు క‌లిసి మట్టి గణపతుల్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించారు. మీరు కూడా మట్టి గణపతుల్ని చేసుకుని పూజించండి అంటూ మెసేజ్ ఇస్తున్నారు. 

వీరిద్దరూ కొద్ది రోజులుగా యూ ట్యూబ్‌లో సంద‌డి చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం  యూట్యూబ్ లో A&S అనే పేరుతో చానల్ స్టార్ట్ చేసిన ఈ చిన్నారులిద్దరూ..మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారులందరినీ ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు వేయటంలో సితార, ఆద్య పోటీలు పడి మరీ చేశారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ త‌ర్వాత ప‌లు వీడియోలు కూడా షేర్ చేశారు. 

దీంతో వినాయక చవితి సందర్భంగా సితారా, ఆద్యలు  మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌ని త‌యారు చేయ‌డం ఎలానో వీడియో ద్వారా చూపించారు. మూడు స్టెప్పుల‌లో వినాయ‌కుడిని చేసుకోవ‌చ్చ‌ో వీడియోలో చేసి చూపించారు. ఈ వీడియోని చూసి మ‌ట్టిగ‌ణ‌ప‌తుల‌ని త‌యారు చేసుకోమని కూడా చెప్పారు.