Hrithik Roshan : వార్ 2 రిలీజ్ కి ముందు 31 కోట్లు ఖర్చుపెట్టిన హృతిక్ రోషన్.. ఎందుకంటే..?

ఈ సినిమా రిలీజ్ కి ముందు హృతిక్ రోషన్ ఏకంగా 31 కోట్లు ఖర్చుపెట్టాడట.

Hrithik Roshan

Hrithik Roshan : హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలిసి నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2 నిన్న ఆగస్టు 14న రిలీజయి థియేటర్స్ లో అలరిస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు హృతిక్ రోషన్ ఏకంగా 31 కోట్లు ఖర్చుపెట్టాడట. ఎందుకో తెలుసా?

హృతిక్ రోషన్ ముంబై అంధేరిలో ఓ అపార్ట్మెంట్ లోని 3 కమర్షియల్ లగ్జరీ ఫ్లాట్స్ ను కొన్నాడట. హృతిక్, తన తండ్రి రాకేష్ రోషన్ కి చెందిన హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ సంస్థ ద్వారా 31 కోట్లు ఖర్చుపెట్టి మూడు ఫ్లాట్స్ ని కొన్నారు హృతిక్ రోషన్. ఈ ఫ్లాట్స్ ని తనకు నచ్చినట్టు మార్చుకునేందుకు మరో 3 కోటు ఖర్చుపెడుతున్నాడట.

Also Read : Mrunal Thakur : పదేళ్ల క్రితం చేసిన కామెంట్స్.. ఆ హీరోయిన్ ఫైర్ అవ్వడంతో సారీ చెప్పిన మృణాల్ ఠాకూర్..

త్వరలో హృతిక్ దర్శకత్వంలో క్రిష్ 4 సినిమా చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే ఈ ఫ్లాట్స్ కొన్నాడని, ఆ సినిమాకు సంబంధించిన వర్క్ ఇక్కడే చేస్తాడని బాలీవుడ్ టాక్. హృతిక్ గత సంవత్సరం ఇదే అంధేరిలో మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ని 6.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు.