Vijay Yesudas : ఏసుదాస్ తనయుడి ఇంట్లో భారీ చోరీ..

ప్రముఖ సింగర్ ఏసుదాసు తనయుడు యువ సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 60 సవర్ల బంగారం, కొన్ని వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి.

Huge Robbery in Vijay Yesudas House

Vijay Yesudas :  ఇటీవల సెలబ్రిటీల ఇళ్లల్లో చోరీలు(Robbery) ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే రజినీకాంత్(Rajinikanth) కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగి డబ్బులు, బంగారం మాయమయ్యాయి. దీనిపై సౌందర్య రజినీకాంత్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ ఘటన మరవకముందే తాజాగా మరో సెలబ్రిటీ ఇంట్లో చోరీ జరిగింది.

NTR 30 : వస్తున్నా అంటూ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్పెషల్ పోస్ట్ .. మొదలుపెట్టిన ఎన్టీఆర్ 30 షూట్..

ప్రముఖ సింగర్ ఏసుదాసు తనయుడు యువ సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 60 సవర్ల బంగారం, కొన్ని వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ చోరీపై విజయ్ ఏసుదాస్ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ విషయం బయటకు వచ్చింది. అయన ఇంట్లో పని చేసే సిబ్బంది పైనే తనకు అనుమానమున్నట్టు పోలీసులకు తెలిపారు విజయ్ ఏసుదాసు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.