Nagarjuna : హీరో నాగార్జునకు హైడ్రా షాక్‌.. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత..

హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేస్తుంది హైడ్రా బృందం.

Hydra Demolition On Nagarjuna N Convention

హీరో అక్కినేని నాగార్జునకు హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) షాకిచ్చింది. ఆయ‌న‌కు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేస్తుంది హైడ్రా బృందం. మాదాపూర్‌లో భారీ బందోబ‌స్తు మ‌ధ్య తెల్ల‌వారుజాము నుంచి కూల్చివేతను అధికారులు చేప‌ట్టారు.

తుమ్మిడి చెరువును ఆక్ర‌మించి ఈ నిర్మాణం చేప‌ట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాదాపు మూడున్న‌ర ఎక‌రాలు క‌బ్జా చేసి క‌న్వెన్ష‌న్‌ను నిర్మించార‌ని అధికారుల‌కు ఫిర్యాదులు వ‌చ్చాయి.

Shakhahaari : కన్నడలో హిట్ మూవీ తెలుగు ఓటీటీలో.. ‘శాకాహారి’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పట్నించి అంటే..

తెలంగాణ సీఎంగా కేసీఆర్ హ‌యాంలో జీహెచ్ఎంసీ కమిషన‌ర్‌గా సోమేష్ కుమార్ ఉన్న‌ప్పుడు ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. నిర్మాణాన్ని కూల్చివేయ‌డానికి వెళ్లిన బుల్డోజర్లు దాన్ని టచ్‌ చేయకుండానే వెన‌క్కి వ‌చ్చేశాయి. అప్పటినుంచి ఈ భవనం జోలికి ఎవరూ వెళ్లలేదు. ఈ కట్టడాన్ని నేలమట్టం చేసి చెరువును పునరుద్ధరించాలని స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగింది హైడ్రా.

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్ ప‌రిధిలో అక్ర‌మ నిర్మాణాల‌ను అడ్డుకునేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం, విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో న‌గ‌రానికి అండ‌గా ఉండ‌డం హైడ్రా ప్ర‌ధాన ల‌క్ష్యాలు. ఇప్ప‌టికే ప‌లు చోట్ల అక్ర‌మ నిర్మాణాల‌ను హైడ్రా కూల్చివేసింది.

Raviteja : షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఆరు వారాల పాటు రెస్ట్