Hyper Aadi : జబర్దస్త్ గురించి నెగిటివ్ గా మాట్లాడేవారిపై ఫైర్ అయిన హైపర్ ఆది.. జబర్దస్త్ మీద పడి ఏడ్చేవాళ్లకు..
తాజాగా హైపెర్ ఆది జబర్దస్త్ గురించి నెగిటివ్ గా మాట్లాడేవారిపై ఫైర్ అయ్యాడు.

Hyper Aadi Fires on Who Trolled Jabardasth
Hyper Aadi : జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు సినీ పరిశ్రమలోకి వచ్చి ఎదిగారు. చాలా మంది ఆర్టిస్టులు జబర్దస్త్ తో తమ లైఫ్ లలో సెటిల్ అయ్యారు. అయితే ఇటీవల కొంతమంది జబర్దస్త్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. డబల్ మీనింగ్ జోక్స్ అని, కామెడీ ఉండట్లేదని, అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులపై కూడా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా హైపెర్ ఆది జబర్దస్త్ గురించి నెగిటివ్ గా మాట్లాడేవారిపై ఫైర్ అయ్యాడు.
రాకింగ్ రాకేష్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కించిన KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కు చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు గెస్ట్ లుగా వచ్చారు. హైపర్ ఆది కూడా ఈ ఈవెంట్ కు రాగా సినిమా గురించి మాట్లాడి అనంతరం జబర్దస్త్ గురించి మాట్లాడారు.
Also Read : Hyper Aadi : ఆ రోజు ఫిలిం ఛాంబర్ కి పిలిచి అతనిపై చెయ్యి చేసుకున్నారు.. ఆ తర్వాత అక్కడే సన్మానం చేసారు..
హైపర్ ఆది మాట్లాడుతూ.. ఈ స్టేజి మీద ఉన్నవాళ్ళంతా జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళే. కొంతమంది జబర్దస్త్ గురించి నెగిటివ్ గా మాట్లాడతారు. వాళ్లకు చెప్తున్నా ఇదే జబర్దస్త్ నుంచి బలగం సినిమా వచ్చింది, హీరో సుధీర్ వచ్చాడు, గెటప్ శ్రీను వచ్చాడు, ధనరాజ్, చమ్మక్ చంద్ర, చంటి, ఆటో రామ్ ప్రసాద్, హైపర్ ఆది.. ఇలా ఎంతో మంది ఆర్టిస్టులు ఎదిగారు. కొన్ని వందల మంది ఆర్టిస్టులు జబర్దస్త్ ని నమ్ముకొని ఇల్లు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉన్నారు. ఇదే జబర్దస్త్ కొన్ని వందల మంది టెక్నిషియన్స్ ఫ్యామిలీలకు మూడు పూటల భోజనం పెడుతుంది. ఇలాంటి జబర్దస్త్ ని కొంతమంది కూర్చొని డబల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తారు అని తిడతారు. మరి మీరెవరూ చూడకుండానే యానిమల్ సినిమాకు 700 కోట్లు వచ్చాయా? చేసేవి గుడి వెనక పనులు చెప్పేవి ఏమో వివేకానంద సూక్తులు. ఈ జబర్దస్త్ మీద పడి ఏడ్చేవాళ్లకు ఒకటే చెప్తున్నా ఇంత చెప్పాక కూడా మళ్ళీ జబర్దస్త్ మీద ఏడిస్తే నా గడ్డం, జుట్టులో రెండు వెంట్రుకలు ఊడాయనుకుంటాను. ఇక్కడ ఉన్న అందరూ ఎవరూ ఈజీగా పైకి వచ్చినవాళ్లు కాదు. వాచ్ మెన్ తోసేస్తే కిందపడి, భోజనం చేస్తుంటే ప్లేట్ లాక్కున్న దగ్గర్నుంచి, వర్క్ చేస్తే డబ్బులు ఇవ్వకపోయినా అన్ని భరించి ఎదిగిన వాళ్ళు. కాబట్టి మీరు నెగిటివ్ కామెంట్ చేసేముందు ఆలోచించండి. నవ్వించడం ఈజీ అనుకుంటే, మీకు ట్యాలెంట్ ఉంటే మల్లెమాల ఆఫీస్ కి రండి నేనే ఆడిషన్ చేసి ఛాన్స్ ఇస్తా అని అన్నారు. దీంతో హైపర్ ఆది వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.