Hyper Aadi : ఆ రోజు ఫిలిం ఛాంబర్ కి పిలిచి అతనిపై చెయ్యి చేసుకున్నారు.. తర్వాత అక్కడే సన్మానం చేసే స్థాయికి ఎదిగాడు..
హైపర్ ఆది సినిమా గురించి, జబర్దస్త్ గురించి మాట్లాడి అనంతరం ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Jabardasth Hyper Aadi Reveals Interesting Thing about Balagam Venu
Hyper Aadi : సినీ, టీవీ పరిశ్రమలో చాలా మంది కష్టపడి, అవమానాలు ఎదుర్కొని పైకి వచ్చినవాళ్లే ఉంటారు. తాజాగా అలాంటి ఓ వ్యక్తి గురించి హైపర్ ఆది తాజాగా మాట్లాడాడు. రాకింగ్ రాకేష్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కించిన KCR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కు చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు గెస్ట్ లుగా వచ్చారు. హైపర్ ఆది కూడా ఈ ఈవెంట్ కు రాగా చాలా కామెంట్స్ చేసాడు.
Also Read : Jani Master : జైలు నుంచి వచ్చాక ఫస్ట్ టైం మీడియా ముందుకు జానీ మాస్టర్.. ఇలా జరిగితే ఎవరూ ఉండరు కానీ..
హైపర్ ఆది సినిమా గురించి, జబర్దస్త్ గురించి మాట్లాడి అనంతరం ఓ ఆసక్తికర విషయం తెలిపారు. హైపర్ ఆది మాట్లాడుతూ.. 2013లో జబర్దస్త్ లో ఓ వ్యక్తి నవ్వించడానికి వస్తే ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరిగితే కొంతమంది ఫిలిం ఛాంబర్ వద్దకు పిలిచి అతనితో సారి చెప్పించుకున్నా సరే అతని మీద చెయ్యి చేసుకున్నారు. ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలాయి తెలీదు కానీ అతను చూసి చూసి ఒకటే దెబ్బ బలగం సినిమాతో కొట్టాడు. అతనే జబర్దస్త్ వేణు అన్న. ఎక్కడైతే అతనికి అవమానం జరిగిందో అక్కడే అతనికి సన్మానం జరిగింది. జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి బలగం వేణు అని అందరూ ఆయన వైపు చూసే స్థాయికి ఎదిగారు. ఆయన హిట్ తో పాటు మర్యాద కూడా తెప్పించారు. జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టం తెలిసినవాళ్ళు గౌరవిస్తారు, కానీ నవ్వించడం ఏముందిలే అని హేళన చేసే వాళ్ళతో కూడా గౌరవించేలా చేసింది వేణు అన్న అని అన్నారు.