Hyper Aadi : పవన్ కళ్యాణ్ గారు గెలవడంలో లక్షల మంది సపోర్ట్ ఎంత ఉందో.. ఫ్రెండ్ గా త్రివిక్రమ్ గారి సపోర్ట్ కూడా అంతే ఉంది..

లక్కీ భాస్కర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైపర్ ఆది మాట్లాడుతూ త్రివిక్రమ్ గురించి పొగిడాడు. అయితే తన స్పీచ్ చివర్లో..

Hyper Aadi Interesting Comments on Trivikram and Pawan Kalyan in Lucky Baskhar Pre Release Event

Hyper Aadi : పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. తాజాగా హైపర్ ఆది వీరిద్దరిపై ఓ ఆసక్తికర కామెంట్స్ చేసారు. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమాలో హైపర్ ఆది కూడా ఓ కీలక పాత్ర పోషించారు.

Also Read : Vijay – NTR : పార్టీ మొదటి సభలోనే.. సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన తమిళ్ స్టార్ విజయ్..

దీంతో లక్కీ భాస్కర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైపర్ ఆది మాట్లాడుతూ త్రివిక్రమ్ గురించి పొగిడాడు. అయితే తన స్పీచ్ చివర్లో.. పవన్ కళ్యాణ్ గారు అన్ని కష్టాలు దాటుకొని గెలవడంలో కొన్ని లక్షల మంది సపోర్ట్ ఎంతైతో ఉందో ఒక ఫ్రెండ్ గా త్రివిక్రమ్ గారి సపోర్ట్ కూడా అంతే ఉంది అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాణ్ కు అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తారని, ఇద్దరూ చాలా క్లోజ్ చేస్తారని అందరికి తెలిసిందే.