దోమలతో జాగ్రత్త : డెంగ్యూ నుంచి కోలుకుంటున్నా – రేణూ దేశాయ్

  • Published By: madhu ,Published On : September 15, 2019 / 08:31 AM IST
దోమలతో జాగ్రత్త : డెంగ్యూ నుంచి కోలుకుంటున్నా – రేణూ దేశాయ్

Updated On : September 15, 2019 / 8:31 AM IST

దోమల నుంచి జాగ్రత్తగా ఉండాలని..తాను డెంగ్యూ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. జ్వరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సినిమాల నుంచి రెస్టు తీసుకున్న ఈమె..బుల్లితెరపై ప్రసారమౌతున్న రియాల్టీ షోలు..ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. 

డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్ చేయాల్సిన వచ్చిన సమయంలో ఇలా ఉన్నామంటూ..ఓ ఫొటో కూడా పోస్టు చేశారు. ఢీ ఛాంపియన్ షిప్ షోలో రేణూ పాల్గొంటాున్నారు. కొన్ని గంటల పాటు షూటింగ్‌కు నో చెప్పాలేకపోయినట్లు తెలిపారు. దోమల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దుస్తుల విషయంలో పలు జాగ్రత్తలు తెలిపారు. పొడవైన దుస్తులనే వాడుకొండి అని తెలిపారు. 

డ్యాన్స్ షో ఢీ 12 సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఢీ ఛాంపియన్ పేరిట ఈ సీజన్ ప్రసారం కానుంది. రేణూ దేశాయ్ రైతుల నేపథ్యంలో తెరకెక్కించే సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.