Bigg Boss 8 : విష్ణు ప్రియ నాకు నచ్చింది పృథ్వి కి తల్లి షాక్.. దానికి ఒప్పుకున్నట్టేనా..

I liked Vishnu Priya Prithvi mother shocking comments bigg boss 8 promo
Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హౌస్ లోకి యష్మీ, రోహిణి, అవినాష్, నిఖిల్, నబీల్ పేరెంట్స్ వచ్చారు. అయితే తాజాగా విడుదల చేసిన నేటి ఎపిసోడ్ ప్రోమోలో పృథ్వీ తల్లి, విష్ణు ప్రియ తండ్రి వచ్చారు. మొదట విష్ణు తండ్రి హౌస్ లోకి రాగానే విష్ణు వెళ్లి గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యింది. జనాలకి నువ్వు ఇంకా నచ్చాలని చెప్తూనే.. నేను విష్ణు కి చాలా అన్యాయం చేశా. చాలా సార్లు మిస్స్ అయ్యా, కానీ చెప్పలేకపోయా అంటూ విష్ణు తండ్రి ఏడుస్తారు.
Also Read : Tollywood Actress : చిన్నప్పుడు స్టేజిపై ట్రోఫీ తీసుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
తర్వాత తేజా మాట్లాడుతూ.. ఇప్పుడు మీకొక పెద్ద బాధ్యత ఉంది. అదే విష్ణు పెళ్లి అని అంటే.. చేస్తా తనకి నచ్చిన వాడు దొరకాలికదా అని విష్ణు తండ్రి అంటారు. అప్పుడు విష్ణు, పృథ్వి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడతారు. తర్వాత పృథ్వి తల్లి హౌస్ లోకి వస్తుంది. పృథ్వి తల్లి రాగానే విష్ణు తన కాళ్ళు మొక్కుతుంది. తర్వాత నీకు ఇంట్లో ఎవరంటే ఇష్టం అని పృథ్వి అడిగితే విష్ణు అని చెప్తుంది పృథ్వి తల్లి. అనంతరం అందరికీ ఆమె అన్నం తినిపిస్తారు.
అలా హౌస్ లోకి అందరి పేరెంట్స్ వస్తుంటే తేజ మాత్రం చాలా ఎమోషనల్ అవుతాడు. అందరి అమ్మలు వస్తున్నారు. మా అమ్మని కూడా పంపు బిగ్ బాస్ అని ఏడుస్తాడు. తర్వాత గౌతమ్ బ్రదర్ వస్తాడు. ఇప్పటి నుండి గేమ్ మాత్రమే ఆడు. ట్రయాంగిల్ స్టోరీలు మానెయ్. గేమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని అన్నాడు. తర్వాత గౌతమ్ బ్రదర్, పృథ్వి తల్లి ఇద్దరూ వెళ్లే సమయంలో ఓ గేమ్ ఆడి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారు. అలా ప్రోమో ఎండ్ అవుతుంది.